కోలీవుడ్ లో ‘కొచ్చాడియాన్’ గా, టాలీవుడ్ లో ‘విక్రమసింహ’ గా అంతేకాకుండా మరో నాలుగు ప్రపంచ భాషలలో అనువాదం చెయ్యబడుతూ 125 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపికా పడుకొనే హీరోయిన్ గా అంతర్జాతీయ సంగీత దర్శకుడు రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న రజినీ కొచ్చాడియాన్ గురించి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ సినిమా దర్శకురాలు రానిజీ కుమార్తె సౌందర్య మీడియా కు తెలియజేశారు.

కొచ్చాడియాన్ అంటే బుజాలపైకి వేలాడే పొడువైన జుట్టు ఉన్న రాజు అని అర్ధం అట. ఈ సినిమాలో గ్రాఫిక్స్ మాయతో అలనాటి హాస్య నటుడు నగేష్ చేత ఒక ప్రముఖ పాత్ర ను చేయిస్తున్నారట. ఈ సినిమాలో రజినీ సముద్రం అడుగున డాల్ఫిన్స్ తో చేసే పోరాటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని సౌందర్య అంటోంది. ఇక ఈ సినిమా ప్రచారాన్ని కూడా చాలా వినూత్న పద్ధతులలో చెయ్యబోతున్నారు. ఈ సినిమా ప్రచారం కోసం ఈ సినిమా పేరుతో ఆన్ లైన్ గేమ్స్, కామిక్ బుక్స్ రెడీ పెట్టిందట సౌందర్య. అంతేకాదు భారతదేశంలోని ప్రముఖ బెస్ట్ డ్రెస్ డిజైనర్స్ చేత 150 రకాల స్కెచ్ లు వేయి౦ఛి చివరిగా రజినీ కోసం 30 రకాల దుస్తులను ఎంపిక చేశారట.

ఈ సినిమాలో రజినీ ఒక పాటను కూడా పాడారు. అంతేకాదు ఈ సినిమాను ఏ భాషలో చూస్తే ఆ భాషలోని వారికి సుపరిచితమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాలో సన్నివేశాలను డిజైన్ చేశామని సౌందర్య చెపుతోంది. ఇక ఈ సినిమా టీజర్ కు కేవలం వారం రోజుల్లోనే కొన్ని వేల లక్షల క్లిక్స్ రావడం ఇండియన్ సినిమా రికార్డు గా చెపుతున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం 90 కెమెరాలను వినియోగించడం కూడా రికార్డు అంటోంది సౌందర్య. దాదాపు తన ఆరేళ్ళ కలకు, కృషి కి దర్పణంగా ఉండే ఈ సినిమా ను రజినీ పుట్టినరోజైన డిసెంబర్ 12 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు సౌందర్య చెపుతోంది. దీపావళి కి ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్ విడుదల చేస్తాను అంటున్న సౌందర్య ఈ సినిమా ద్వారా రజినీ స్థాయిని ఏ స్థితికి తీసుకువవెళుతుంది అనే ఆశక్తికర చర్చ ప్రస్తుతం దక్షినాది సినిమా పరిశ్రమలో జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: