వామ్మో... నిండా ముంచుతుందనుకున్న ‘అత్తారింటికి దారేది’ అదరగొట్టింది. టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం కలెక్షన్ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం మూడు రోజుల్లో ఏకంగా 45 కోట్లు సంపాదించి నిర్మాత ఇంట్లో కనకవర్షం కురిపించింది.

మొదటి రోజు ఆంద్రప్రదేశ్ లో 10.72కోట్లు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా, దేశ, ప్రపంచ వ్యాప్తంగా 5.28 కోట్లు కొల్లగొట్టింది, అంటే మొదటి రోజు అత్తారింటి సంపాదన 16 కోట్లు అన్నమాట. ఇక రెండవ రోజు  11కోట్లు, మూడవ రోజు ఏకంగా 18 కోట్లు కలెక్షన్లు రాబట్టింది, అంటే కేవలం విడుదలయిన మూడు రోజుల్లోనే ఏకంగా 45 కోట్లు సంపాదించింది అన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: