ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న హన్సిక టాలీవుడ్ లో గత సంవత్సరం విడుదల అయిన ‘దేనికైనా రెడీ’ తరువాత హన్సిక క్రేజ్ ఇక్కడ కూడా బాగా పెరిగిపోయింది. ఈమధ్యనే హీరో సూర్య తో నటించిన ‘సింగం-2’ సూపర్ హిట్ తో హన్సిక ఏమి చెపితే అదే అంటున్నారు కోలీవుడ్ దర్శకనిర్మాతలు. కోలీవుడ్ లోని యంగ్ హీరోలు శింబు, శివ కార్తికేయన్, కార్తి లతో బడా సినిమాలు చేస్తున్న హన్సికకు టాలీవుడ్ లోని ఒక నిర్మాతతో తగువులు ఏర్పడ్డాయి అని వార్తలు వస్తున్నాయి.

ఇక వివరాలలోకి వెళితే, చాలా సంవత్సరాల క్రితం హన్సిక, హీరో నితిన్ లు కలిసి నటించిన ‘సీతారాముల కళ్యాణం లంకలో’ సినిమా టాలీవుడ్ లో విడుదల అయి అప్పట్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే ప్రస్తుతం ఒక నిర్మాత ఆ సినిమాను తమిళంలో డబ్ చెయ్యబోతున్నాడు అట. ‘రౌడీ కొట్టై’ పేరుతో ఈ సినిమాను కోలీవుడ్ లో విడుదల చేయ్యబోతున్నారని తెలిసి ఆ ప్రయత్నం మానుకోమని హన్సిక ఆ నిర్మాతకు సూచించిందట. ప్రస్తుతం కోలీవుడ్ మార్కెట్ లో తనకున్న సక్సెస్ గ్రాఫ్ ను ఈ ఫెయిల్యూర్ సినిమా పాడుచేస్తుందని హన్సిక భయం అట.

అందువల్ల ఆ సినిమాను డబ్ చేయవద్దని, అన్నివిధాలా హన్సిక నచ్చజెప్పినా ఆ నిర్మాత వినకుండా ముందుకు వెళ్లిపోవడంతో ఏదో విధంగా ఆ సినిమాను ఆపు చేద్దామని సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో హన్సిక కంప్లైంట్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. కాని ఒక భాషలో నిర్మించిన ఒక సినిమాను వేరే భాషలో డబ్ చేసుకోవడానికి నిర్మాతకు రైట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తాము ఏమీ చెయ్యలేము అంటూ నిర్మాతల మండలి కూడా చేతులు ఎత్తేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఫెయిల్యూర్ సినిమా బ్యాడ్ ఇమేజ్ నుండి హన్సిక తప్పించుకోవడానికి ఇంకా ఏమి మార్గాలు వెతుక్కుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: