మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైట‌ర్‌గా కెరియ‌ర్‌ను స్టార్ట్ చేసి డైరెక్టర్‌గా మారి టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ఎన్నో ఫ్యామిలి ఎంట‌ర్‌టైనింగ్ మూవీల‌ను, బాక్సాపీస్‌ను షేక్ చేయ‌గ‌ల చిత్రాల‌ను అందించాడు. అలాంటిది త్రివిక్రమ్ కెపాసిటి మీదే టెస్టింగ్ జ‌రిగింది ఓ ఛాన‌ల్‌లో. రోజు రోజుకి ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఎటువంటి పోటీ జ‌రుగుతుందో తెలుసుకోవ‌డం క‌ష్టంగా ఉంది. టి.ఆర్‌.పిల పరుగుతో ఈ పోటీ అనేది మితిమీరుతుంది, దారి త‌ప్పుతుద‌ని మాత్రం చెప్పవ‌చ్చు. ముఖ్యంగా త్రివిక్రమ్‌,ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ వ‌చ్చిన లేటెస్ట్ మూవీ అత్తారింటికి దారేది. ఈ మూవీ స‌క్సెస్‌ను ప్రేక్షకుల‌తో పంచుకోవ‌డానికి త్రివిక్రమ్, స‌మంత ఓ లీడింగ్ న్యూస్ ఛాన‌ల్‌కి వెళ్ళింది.

వెంట‌నే మ‌రో లీడింగ్ ఛాన‌ల్ త్రివిక్రమ్‌కి క‌బురుపెట్టింది. మా ఛాన‌ల్‌కి రండి అని. కాని త్రివిక్రమ్ మ‌రోసారి వ‌స్తాను అని చెప్పడంతో వెంట‌నే అదే రోజు త్రివిక్రమ్ మీద నెగిటివ్ స్టోరిను ఆ ఛాన‌ల్ ప్లే చేసింది. ప‌వ‌న్ లేకుండా ఈ మూవీ ఇంత స‌క్సెస్ అయ్యేదా, ఇందులో డైరెక్టర్ గొప్పద‌నం ఏంటి, జ‌ల్సా,ఖ‌లేజా,అత‌డు మూవీల‌ను ప్లాప్ చేసిన త్రివిక్రమ్‌కు స్టార్ హీరో లేకుండా హిట్టు సాధ్యమా అంటూ చెప్పుకోని రీతిలో నెగిటివ్ స్టోరీను వేశారు. ఆ ప్రొగ్రామ్‌ను చూస్తున్న ఎవ‌రైనా ఆ మాట‌ల‌ను న‌మ్మలేని విధంగా ఉన్నాయి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఆ స్టోరి వెనుక ఉన్న అస‌లు క‌థ‌ను తెలుకొని ఆ ఛాన‌ల్‌కు వెళ్ళవ‌ద్దని కొంత మంది సెల‌బ్రిట‌ల‌కు స‌మాచారం అందించార‌ని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: