ఈ మధ్య  ఒక ప్రముఖ చానెల్ లో మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హీరో సునీల్ విషయం ఫై మౌనం వీడారు. సునీల్ –త్రివిక్రమ్ లు ఇద్దరూ చిన్న నాటి స్నేహితులు అన్న సంగతి చాలా మందికి తెలెయదు. వీరిద్దరూ  టాలీవుడ్  లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఇద్దరూ రూమ్ మేట్స్ గా ఉండేవారు.  త్రివిక్రమ్ రచయితగా ఎదిగే క్రమంలో సునీల్ కి తను రాసే స్క్రిప్టులలో మంచి పాత్రలు రాసి లిప్ట్ ఇచ్చేవాడు . అంతేకాదు  కమిడియన్ గా  సునీల్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేలా చేసాడు మన మాటల మాంత్రికుడు . త్రివిక్రమ్ దర్శకుడుగా మారాక కూడా ఆయన తీసిన సినిమాలు అన్నింటి లోను సునీల్ కు  చిత్రలలో  కీలక పాత్రలు  ఇస్తూ  వచ్చాడు.

అయితే జులాయి, అత్తారింటికి దారేది చిత్రాల్లో మాత్రం సునీల్  కనపడక పోవడం అనేక   రూమర్లకు  స్ధానం   ఇచ్చింది .  అయితే అత్తారింటి మీడియా ఇంటర్వ్యూ లలో ఈ రూమర్ లకు  చెక్ పెట్టాడు త్రివిక్రమ్ . ఈ రోజు సునీల్ మంచి పొజీషన్ లో ఉన్నాడని అంటూ   హీరో గా మర్యాదరామన్న, పూల రంగడు చిత్రాలలో హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి  ఇలాంటి సమయంలో  సునీల్ చేత కామెడీ పాత్రలు చేయచటం పద్దతి కాదు, అని అంటూ  ఓ స్నేహితుడుగా  సునీల్  ఎదుగుదలను కోరుకునే వ్యక్తినని చెపుతూ అలాంటి సందర్భాలలో  సునీల్ కు  చిన్న వేషాలు ఎలా ఇస్తానని తిరిగి ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తినే అడిగారు  త్రివిక్రమ్.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ తో కలిసి  చిన్న సినిమాలు తీయ బోతున్నాడు. కాబట్టి త్వరలోనే తన స్నేహితుడు సునీల్ ను హీరో గా చేసి తన పంచ్ డైలాగుల తో ఒక   మంచి హాస్య సినిమా తీస్తాడని ఆశిద్దాం

 

మరింత సమాచారం తెలుసుకోండి: