వీరు పోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తోన్న దూసుకెళ్తా చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఎప్పుడూ లేనిది ఈసారి విష్ణు సినిమా మీద అంచనాలు కాస్త బాగానే ఉన్నాయి. షూటింగ్ స్టిల్స్, ట్రెయిలర్ వంటివి ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవడమే అందుక్కారణం. 

దూసుకెళ్తా సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మంచు ఫ్యామిలీ. కథ దగ్గర్నుంచి పబ్లిసిటీ కార్యక్రమాల వరకూ ప్రతిదానిలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విష్ణు కూడా సిక్స్ ప్యాక్ పెంచాడు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ ని అదరగొట్టేశాడు. ఆ స్టిల్స్ చూస్తే, నిజంగానే ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అనిపిస్తోంది. ఇక ట్రెయిలర్లో బ్రహ్మానందం కామెడీ చూస్తుంటే, పొట్టలు పగిలిపోవడం ఖాయమని అర్థమవుతోంది. వీటికి తోడు స్లిమ్ గా అయిపోయిన హన్సిక నాజూకు అందాలు ప్రేక్షక హృదయాలను కవ్విస్తున్నాయి. ఇవన్నీ కలిసి దూసుకెళ్తా మీద అంచనాలు పెంచేశాయి.

అయితే వీటన్నిటితో పాటు ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఉంది. అది... రవితేజ వాయిస్ ఓవర్. విష్ణు చిన్నతనంలో వచ్చే సన్నివేశాలకు కాస్త వెటకారంగా, హాస్యం పుట్టేలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఉందట. అందులో రవితేజను మించినవాళ్లు లేరు కాబట్టి అతడితోనే చెప్పించాలని డిసైడ్ అయ్యారట. మన మాస్ మహరాజా కూడా అందుకే సంతోషంగా ఎస్ అన్నాడట. గతంలో మర్యాద రామన్న చిత్రంలో సైకిల్ కు డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు కదా. ఇందులో అందకంటే అదిరిపోద్ది అంటున్నాడు వీరు పోట్ల!

మరింత సమాచారం తెలుసుకోండి: