సడెన్ గా కెనడా నుంచి ఊడిపడింది. పోర్న్ స్టార్ ని అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది. పైగా తను చేసిన పనికి సిగ్గు పడటం లేదంది. బాలీవుడ్లో పాగా వేయడమే లక్ష్యం అంది. ఆమె మాట్లాడే ప్రతి మాటా సెన్సేషన్ అయ్యింది. అదే ఆమెకు ప్లస్ అయ్యింది. తెలిసిపోయిందిగా ఆమె ఎవరో. అవును... ఆమె సన్నీ లియోన్!
కన్నుమూసి తెరిచేలోగా బాలీవుడ్లో బిజీ స్టార్ అయిపోయింది సన్నీ. ఆమెకంటూ కొన్ని చిత్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆమెను ఇష్టపడే ప్రేక్షక వర్గం తయారయ్యింది. అందుకే దర్శకులు ఆమె వెంట పడుతున్నారు. నిర్మాతలు ఆమె కోసం డబ్బులు పెడుతున్నారు. ప్రస్తుతం రెండు మూడు మంచి ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే ఇవన్నీ విశేషాలు కాదు. అసలు విశేషం ఇంకోటుంది. తెర మీద తన ముద్రను వేయాలనుకున్న సన్నీ జీవితం... ఇప్పుడె తెరకెక్కనుంది. కెనడాకు చెందిన ఓ నిర్మాణ సంస్థ అదే పనిలో ఉంది. 

ఎక్కడో కెనడాలో పుట్టి, పోర్న్ స్టార్ అయ్యింది సన్నీ. అయితే తను ఎంచుకున్న పని అందరూ చేయలేనిదే అయినా, అందులో కూడా నంబర్ వన్ అయ్యింది. ఆ తరువాత బాలీవుడ్లో బిజీ తార అయ్యింది. వీటన్నిటినీ కలిపి సినిమాగా తీయనున్నారు. ఆ బాధ్యతను ప్రముఖ దర్శకురాలు దీపా మెహతాకు అప్పగించారు. ఈ విషయాన్ని స్వయంగా సన్నీ భర్త వెబర్ చెప్పాడు. ఎందరో ప్రముఖుల ఆత్మకథలు సినిమాలుగా వచ్చాయి. కానీ ఓ పోర్న్ స్టార్ ఆత్మకథ తెరకెక్కడం... బహుశా ఇదే తొలిసారేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: