తమన్నా తొలి సినిమా ఏది అంటే చాలామంది హ్యాపీడేస్ అనే అనేస్తారు. అంతకంటే ముందు ఓ సినిమా చేసిందన్న విషయమే చాలామందికి గుర్తుండదు. మంచు మనోజ్ తో చేసిన ఆ సినిమాలో తమన్నా ఎవరికీ నచ్చలేదు. కానీ హ్యాపీ డేస్ చూసిన తర్వాత అందరూ ఆమెకి ఫ్యాన్స్ అయిపోతారు. టాలీవుడ్ అయితే ఆమెను అవకాశాలతో ముంచెత్తింది.

టాప్ హీరోలందరితోనూ అవకాశాలను అందిపుచ్చకుంటూ తెలుగు పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది తమన్నా. పాలనురగు లాంటి మేని ఛాయ, నాజూకైన శరీరం, అదరగొట్టే డ్యాన్సులతో ఎంతోమందికి ఆరాధ్య దేవత అయ్యింది. అయితే ఆమె మనసు బాలీవుడ్ వైపు లాగేసింది. రెక్కలు కట్టుకుని అక్కడికి ఎగిరిపోయింది. అయితే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మళ్లీ దక్షిణాది వైపే అడుగులు వేస్తోంది. తెలుగులో ఒకట్రెండు చిత్రాలను అందిపుచ్చుకుంది. తమిళంలో కూడా అజిత్ సరసన నటిస్తోంది. ఇందులో పర్ ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నానని చెబుతోంది. గ్లామరస్ గా ఉండే పాత్రలు చేయకూడదని అనుకున్నారా అంటే, అలాంటిదేమీ లేదు అంటోంది.

చెప్పాలంటే, తమన్నా గ్లామర్ నటే. ఆమె అందమే ఆమెను నిలబెట్టింది. మంచి నటనను ప్రదర్శించినా ఆమెను గ్లామర్ స్టార్ గానే ప్రేక్షకులు ఇష్టపడతారు. అదే అంటే... కేవలం గ్లామర్ మాత్రమే ఉంటే ఎవరూ ఇష్టపడరు, నటిగా నిలదొక్కుకోవాలంటే టాలెంట్ కూడా ఉండాలి, అది ఉండబట్టే నేనిక్కడున్నాను అంటోంది. పైగా... ఎంతసేపూ అందాలనే ప్రదర్శిస్తూ ఉంటే, చూసేవాళ్లకు కూడా బోర్ కొడుతుంది, అప్పుడప్పుడూ చేంజ్ ఉండాలి అంటోంది. ఎంత మాట అన్నావ్ తమన్నా, నీ అందాలు మాకు బోర్ కొడతాయా అంటున్నారు ఆమె మాటలు విన్న కుర్రకారు. మరి తమన్నాకి అలా ఎందుకనిపించిందో!

మరింత సమాచారం తెలుసుకోండి: