దర్శకరత్న దాసరికీ చిరంజీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి కుటుంబం తో తీవ్రంగా విభేదించే దాసరి ఒక బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ ను పొగడ బోతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఆదివారం శిల్పకళా వేదికలో జరగబోయే ‘అత్తారింటికి దారేది’ యూనిట్ కృతజ్ఞతా సభలో దాసరినారాయణ రావు కూడా పాల్గొన బోతున్నాడని తెలుస్తోంది.ఈ విషయమై ఈ సినిమా యూనిట్ వారు దాసరిని కూడా ఆహ్వానించారని దానికి దాసరి ఓకె అన్నారని ఫిలింనగర్ టాక్.

నిన్న దాసరి ఈ సినిమాను ప్రసాద్ లేబరటరీలో కొంతమంది ప్రముఖులతో కలిసి చూసారని సినిమా చుసిన వెంటనే తన ఆనందాన్ని ఆపుకోలేక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసును పొగడ్తలతో ముంచెత్తి వేసారని అంటున్నారు. అత్తారింటి సినిమా విజయాన్ని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ తమ సొంత విజయంగా భావిస్తూ పెద్ద తారల దగ్గర నుంచి చిన్న తరాల వరకు ఈసినిమాను తమ భుజాల పై ఎక్కించుకుని మోస్తున్నారు అన్న విషయం వాస్తవం. ఎప్పుడూ గ్రూపులు గా విడిపోయి ఒకరిపై ఒకరు సటైర్లు వేసుకునే టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ ‘అత్తారింటి’ విజయాన్ని తమ విజయంగా భావిస్తూ మాట్లాడుతున్నారు.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకపోతే ఆ వ్యక్తి పై భయంకరమైన సెటైర్లు వేసే దాసరి వచ్చే ఆదివారం పవన్ కళ్యాణ్ ను ఏ ఎత్తులో ఆకాశానికి ఎత్తేస్తాడో అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ విజయోత్సవ సభకు చిరంజీవి రామ్ చరణ్, అల్లుఅర్జనులలో ఎవరైనా వస్తారా లేకుంటే అన్నీ తానై పవన్ కళ్యాణ్ మెగా హీరోగా ఆ ఫంక్షన్ లో ప్రొజెక్ట్ అవుతాడా అనే అనుమానాలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. దాసరి పవన్ కళ్యాణ్ ల నూతన ప్రేమానురాగాల స్నేహం టాలీవుడ్ లోని వర్గాల సమీకరణ మార్పుకు సంకేతం కానుందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా వచ్చే ఆదివారం జరుగబోయే పవన్ ‘అత్తారిల్లు’ విజయోత్సవ సభలో చాలా ఆ శక్తికర విషయాలు ఉండేలా కనిపిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: