నందమూరి సింహం బాలకృష్ణ కోసం ఇటీవల ప్రత్యేకంగా ఓ బైక్ ని సిద్ధం చేసి ఖరీదైన ఆ బైక్ కి కొన్ని అదనపు హంగులు జత చేసి  ఆ బైక్ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను కొన్ని సన్నివేశాలను బాలయ్య కొత్త సినిమా ‘లెజండ్’ కోసం తెరకెక్కించారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ కారుని కూడా అదే తరహాలో సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం హైదరాబాద్ లో ఈకారుతో కొన్ని సన్నివేసాల  చిత్రీకరణ జరుగుతోంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం కొత్తగా కనిపించాలని దర్శకుడు బోయపాటి చాలా  జాగ్రత్తలు తీసుకుంటున్నారుఅని అంటున్నారు.  

ఈ  కారు నేపథ్యంలోనే కొన్ని ముఖ్య  సన్నివేశాలు ఉంటాయట. ఇందులో బాలయ్య రూపు రేఖలు కూడా చాలా రఫ్ గా ఉంటాయని తెలుస్తోంది. `సింహా` తరహాలో బాలకృష్ణ లుక్స్  సరికొత్తగా ఉండాలని బోయపాటి పలు జాగ్రత్తలు తీసుకున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి  లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో దర్శకుడు బోయపాటీ బాలయ్యలు ఉన్నారట.

వర్తమాన రాజకీయాలకు సంబందించి కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి కాబట్టి ఎన్నికల ప్రచార సమయంలో బాలయ్యకు అనుకూలంగా ఉండేలా ఈసినిమాను దర్శకుడు రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. బాలకృష్ణ రాజకీయ ప్రవేశానికి ఈ ‘లెజెండ్’ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: