బాలీవుడ్ బ‌బ్లిబ్యూటి సోనాక్షిసిన్హాకు రొమాన్స్ అంటే ఏంటో ఆ హీరో ద‌గ్గర ఉండి నేర్పించాడు. ఇదంతా షాహిద్‌క‌పూర్ అప్ క‌మింగ్ మూవీలోని ఆన్ స్క్రీన్‌, ఆప్ స్క్రీన్‌లోనూ జ‌రిగిన మేట‌ర్‌. ఈ రొమాంటిక్ మేట‌ర్‌ చిత్ర యూనిట్‌కి తెలియ‌డంతో వీరి వ్యవ‌హారం బాలీవుడ్ అంత‌టా పాకింది. రాంబో రాజ్‌కుమార్ మూవీలో షాహిద్‌క‌పూర్ స‌ర‌స‌న బ‌బ్లీ హీరోయిన్ సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ మంచి యాక్షన్ కం రొమాంటిక్ ప్యాక్‌తో బాక్సాపీస్‌ను దుమ్ము రేప‌టానికి రెడీ అయింది. ఇందులో షాహిద్‌క‌పూర్ యాక్టింగ్‌తో పాటు, డ్యాన్స్‌ల‌ను ఇర‌గ‌దీసాడు. అయితే ఓ సాంగ్‌లో మాత్రం సోనాక్షికు రొమాన్స్ అంటే ఏంటో ద‌గ్గర ఉండి నేర్పించాడు.

ఓ సాంగ్ పిక్ఛరైజేష‌న్ జ‌రుగుతున్న స‌మయంలో షాహిద్‌ను పైకి ఎత్తుకొని ముద్దు పెట్టాలంటా. ఇదంతా ఒకే టేక్‌లో జ‌ర‌గాల‌ని కొరియోగ్రాఫ‌ర్ చెప్పడంతో సోనాక్షి చాలా ప్రయ‌త్నింది, ఆ సీన్‌ను సింగిల్ టేక్‌లో చేయ‌లేక‌పోయింది. షాహిద్‌ను ఎత్తుకున్న త‌రువాత బ‌రువును ఆపుకోవ‌డం ఆమె వ‌ల్ల కావ‌డంలేదు. దాదాపు ప‌ద్నాలుగు టేక్‌లు తీసుకున్న సోనాక్షికు  ప‌దిహేనో టేక్‌లో అమ్మాయిలు అబ్బాయిల‌ను ఏ విధంగా ఎత్తుకుంటే బ‌రువు త‌గ్గుతారో, బ్యాలెన్స్‌గా ఉంటారో షాహిద్‌క‌పూర్‌ చూపించాడంట‌. ఇంకేముంది షాహిద్ చెప్పిన ట్రిక్‌ను ఫాలో అయి, ఆ సీన్‌ను సింగిల్ టేక్‌లో ఫినిష్ చేసిందంట‌. అంతే కాకుండా వీరిద్దరి మ‌ధ్య తెలియ‌ని య‌వ్వారం ఏదో జ‌రుగుతుంది బాలీవుడ్ టాక్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: