రాంచరణ్ రాకెట్ విడుస్తున్నాడు, అది ఇందనం సరిగా మండక తుస్సు మని నేలపైనే ఉంటుందా, లేక సక్సెస్ అయి నింగిలోకి దూసుకెల్తుందా అని టాలీవుడ్ లో టాక్ మొదలయింది. కారణం ఇప్పటికే బాంబుల్లా పేలుతున్నాయనుకున్న తూఫాన్, జంజీర్ లు కనీసం శబ్దం కూడా చేయకుండా తుస్సు మనిపించాయి.

దీంతో డీలా పడ్డ రాంచరణ్ బాంబులపై నమ్మకాన్ని పక్కనబెట్టి రాకెట్ ను నమ్ముకున్నాడట. అదేనండి తూఫాన్ తో పోయిన పరువును ‘ఎవడు’ తో తిరిగి సంపాదించుకోవాలన్న కోరిక, ఆతృత రాంచరణ్ లో బాగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే కదా. పవన్ ‘అత్తారింటికి దారేది’ కి ఎలాంటి సెగ తాకక పోవడంతో చెర్రీలో ఆత్మ విశ్వాసం పెరిగిందంటున్నారు.

అందుకే ‘ఎవడు’ సినిమాను దీపావళి రాకెట్ లా ఆకాశమే హద్దుగా దూసుకుపోవడానికి దీపావళి పండుగకు విడుదల చేయాలనుకుంటున్నాడు. దీపావలి టపాసులా పేలుతుందా లేదా అన్నదే చూడాలి. ఇక సినిమా విషయానికి వస్తే టాప్ హీరోయిన్లు శృతిహాసన్, ఆమీజాక్సన్ లు ఉన్నారు. అంతే కాకుండా స్పెషల్ ఎఫెక్ట్ కింద అల్లు అర్జున్, కాజల్ ఈ సినిమాలో హైలెట్ అంటున్నారు, అందుకే ఇది రాకెట్ లా రాంచరణ్ పరువును ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెలుతుంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: