దర్శకుడు హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విషయంలో విపరీతమైన మధన పడుతున్నాడని టాలీవుడ్ టాక్. దీనికి కారణం దర్శకుడు హరీష్, జూనియర్ రామయ్య సినిమా మొదలైన దగ్గరనుంచి ఈ సినిమా విషయంలో తానే ఒక మీడియా సంస్థగా మారిపోయి తన ట్విటర్ ద్వారా ఇప్పటివరకు ఎవ్వరు చూపించని విధంగా తాను ఈ సినిమాలో జూనియర్ ను చూపిస్తున్నాను అని చెప్పడం అంటున్నారు. పవన్ కళ్యాణ్ పరాజయాలలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ ద్వారా బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ ఇప్పుడు అదే చరిత్రను జూనియర్ సినిమా ద్వారా రిపీడ్ చేయబోతున్నాడా అనే అంచనాలు పెరిగిపోవడం.

 దానికి తగ్గట్టు గానే ఈసినిమాకు వస్తున్న ఓవర్ పబ్లిసిటీ హరీష్ కు టెన్షన్ కలిగిస్తోందట. దీనికి తోడు ‘రామయ్య’ తో విడుదల అవుతుంది అని అనుకున్న పవన్ అత్తారిల్లు ముందుగానే రావడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా మారిపోవడం కూడా దర్శకుడు హరీష్ శంకర్ కు దడ పుట్టిస్తోందట. పవన్ సినిమా ‘అత్తారిల్లు’ విడుదల అయినా కేవలం రెండు వారాల గేప్ తో ఎన్టీఆర్ ‘రామయ్యా’ వస్తూ ఉండటంతో ఎన్టీఆర్ సినిమాను పవన్ సినిమాతో పొలిచి చూస్తారని ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయంలో అలాగే కధనం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా నందమూరి అభిమానులు నిరాశ చెంది, ఆ నిరాశను తన పై కోపంగా మార్చుకుంటారని హరీష్ భయ పడుతున్నాడట.

అదీకాకుండా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తరువాత వెనువెంటనే వచ్చే సినిమా సూపర్ హిట్ ఐన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి కాబట్టి ఈ సెంటిమెంట్ కూడా హర్ష ను భయపెడుతోందట. ఈభయాలువల్ల ఈ సినిమా రీ రికార్డింగ్  ఎడిటింగ్ విషయంలో  ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఏదోవిధంగా ‘రామయ్యా వస్తావయ్యా’ ను సూపర్ హిట్ చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ మధన పడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి, ఈ వార్తల నేపధ్యంలో రామయ్య సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఎన్టీఆర్ కంటే హరీష్ శంకర్ కే సంకటం గా మారింది అంటు ఫిలింనగర్ లో హరీష్ పై సెటైర్లు పడుతున్నాయి....

మరింత సమాచారం తెలుసుకోండి: