లావ‌ణ్య త్రిపాటి అంటే టాలీవుడ్‌కి అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. కాని అందాల‌రాక్షసి ఫేం లావ‌ణ్య త్రిపాటి అంటే అంద‌రూ గుర్తుప‌డ‌తారు. ఈ హీరోయిన్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చింది. త‌న సెకెండ్ ఫిల్మ్ మంచు హీరో విష్ణు స‌ర‌స‌న దూసుకెళ్తా మూవీలో నటిస్తుంది. అందాల రాక్షసి మూవీలో గ్లామ‌ర్ పాత్ర అంత‌గా లేక‌పోయినా, త‌న యాక్టింగ్‌తో మాత్రం టాలీవుడ్‌ని ఆక‌ట్టుకుంది. త‌న సెకెండ్ ఫిల్మ్ దూసుకెళ్తా మూవీలో మాత్రం గ్లామ‌ర్ డోస్‌ను కొంచెం పెంచింది. దీంతో గ్లామ‌ర్ మ‌త్తు ఏంటో  టాలీవుడ్‌కి పరిచ‌యం చేయ‌టానికి రెడీ అయింది. ఈ మూవీలో లావ‌ణ్య అందాలు మ‌రింత‌గా మెరిపోతున్నాయ‌ని దూసుకెళ్లా మూవీ ర‌షెస్‌ను చూసిన వారంటున్నారు.

టాల‌వుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్స్ కొట్టేయాల‌ని లావ‌ణ్య త్రిపాటి ప్లానింగ్స్ వేసుకుంటుంది. అందుకే గ్లామ‌ర్ పాత్రల‌కు నేను రెడీ అని టాలీవుడ్ పెద్దల‌కు మెసేజ్ పంపుతుంది. కుదిరితే ముద్దు సీన్లకు అందుబాటులో ఉంటానంటూ త‌నదైన శైలిలో చెబుతుంది. అందుకే లావ‌ణ్యను మూవీల‌లో తీసుకునేందుకు యంగ్ హీరోలు ఆస‌క్తి చూపుతున్నారు. ఓ బ‌డా హీరో మూవీలోనూ లావ‌ణ్య న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ విశ్వశ‌నీయ స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: