పవన్ 'అత్తారిల్లు' విడుదలై 7 రోజులు కూడా కాకుండానే ఆ సినిమాకు సంబంధించి మరొక ఆ శక్తికరమైన వార్త హడావిడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా  సాధిస్తున్న వసూళ్లు చూసి యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ వర్గాలన్నీ ఆశ్చర్య పోతున్నాయట.  హాలీవుడ్ వర్గాలు సైతం ఈ సినిమాఅమెరికాలో  సాధిస్తున్న వసూళ్ళ గురించి ఆరా తీస్తూ ఒక ప్రాంతీయ భాషా సినిమాకు ఇంత క్రేజా అంటు ఆశ్చర్యపోతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా వేడి ఇంకా తగ్గలేదు అనితెలుస్తోంది.

ఈ సినిమా మార్నింగ్ షో, మ్యాట్నీలు కొద్దిగా తగ్గినా ఫస్ట్ షో, సెకండ్ షో లు మాత్రం ఇంకా టిక్కెట్లు దొరకని పరిస్థుతులు ఉండటంతో ఈ సినిమా సునాయాసంగా 60 కోట్ల మార్కును దాటుతుందని అనడటమే కాకుండా ‘మగధీర’ రికార్డులను ఈసినిమా క్రాస్ చేస్తుంది అని కచ్చితంగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమా    రీమేక్ చేయడం కోసం అప్పుడే తీవ్రమైన పోటీ నెలకొంది అనే వార్తలు వస్తున్నాయి.   హిందీ, తమిళ పరిశ్రమలకు చెందిన పలువురు నిర్మాతలు ఈ సినిమాకోసం పోటీ పడుతున్నారు అని టాక్. అంతేకాదు ఈసినిమాకు భారీగా మొత్తాలు చెల్లించి రీమేక్ రైట్స్ సాధించడానికి  సిద్ధమవుతున్నారట.

తమిళంలో ఈ సినిమాని విజయ్ కథానాయకుడిగా రీమేక్ చేయొచ్చని అక్కడి నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాకు ఇంత డిమాండ్ ఏర్పడిందనీ అంటున్నారు. ఇదివరకు విజయ్ సినిమాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ నిర్మాతలు రీమేక్ చేస్తే, ఇప్పుడు విజయ్ పవన్ సినిమాని రీమేక్ చేయాలని భావిస్తున్నారు. హిందీలో అయితే ఈ కథ ఎవరికి నప్పుతుంది అనే విషయంపై చాలా బాలీవుడ్ సైట్లు ఇప్పటికే ఉహాగానాలు మొదలుపెట్టేసాయి. అటు కోలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో ఈసినిమా రీమేక్ రైట్లు భారీ మొత్తాలకు అమ్ముడుపోవడం ఖాయం అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: