ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి నోట విన్నా దిల్ రాజ్ పేరే విపిస్తోంది. రామ్ చరణ్ తో అత్యంత భారీగా ‘ఎవడు’ తీసి విడుదలకు దారిదోరకక తన ఆఫీసు రూమ్ లో బద్రంగా దాచుకున్న దిల్ రాజ్ ధైర్యంగా తనకు కలిసి వచ్చే దసరా సెంటిమెంట్ ను ఎంచుకుని జూనియర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ అంటు వస్తున్నాడు. దాదాపు 100 కోట్ల పెట్టుబడి బ్లాక్ అయిపోయినా కెమెరాల ముందు ఎప్పుడు నవ్వుతూ కనిపించే దిల్ రాజ్ సన్నిహితులు మాత్రం టెన్షన్ పడుతున్నారట.

దీనికి కారణం సునామీల పవన్ సినిమా ‘అత్తారిల్లు’ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తూ ఉంటే ఆ సునామీకి రామయ్యా సినిమా ద్వారా ఎందుకు ఎదురు వెళ్ళడం అని ప్రశ్నిస్తూ ఉంటే తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన ‘కొత్తబంగారులోకం’, ‘బృందావనం’ సినిమాలు దసరాకు విడుదలై కాసులు కురిపించాయి కాబట్టి అదే సెంటిమెంట్ తో దసరా హ్యాట్రిక్ కొడతానని ధైర్యంగా అంటున్నాడట మన దిల్ రాజ్. అంతేకాదు తెలంగాణ సమైక్య ఉద్యమ సెగలకు తన సినిమాకు ఎటువంటి సంబందం లేదు అంటూ ధైర్యంగా నవ్వుతున్న దిల్ రాజ్ అభిమానులు దిల్ రాజ్ పై ఒక విచిత్రమైన కామెంట్ చేస్తున్నారు. దిల్ దసరా హ్యాట్రిక్ సెంటిమెంట్ కలిసి వచ్చినా కలిసిరాక పోయినా సమంత డైమెండ్ లెగ్ శ్రుతిహాసన్ గోల్డెన్ లెగ్ రామయ్యాను నిలబెట్టి తన 100 కోట్ల బరువును దించుతారని కలలు కంటున్నాడు దిల్ రాజ్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: