అద్భుతమైన నటనా చాతుర్యం ఉంది శర్వానంద్ కి. పైగా కథలను ఎంచుకుని, తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకుని మరీ ముందుకు సాగుతున్నాడు. అందువల్లో ఏమో అతడు చేసే సినిమాల సంఖ్య తక్కువే ఉంటుంది. ఆ తక్కువ సినిమాల్లోనే అట్టర్ ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ వాటిని ఫ్లాపులంటే మనోడు ఒప్పుకోవడం లేదు.

తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా శర్వానంద్ చేసిన సినిమా... కో అంటే కోటి. ఇది బాక్సాఫీసును వణికించింది. ప్రేక్షకుల తలలు పగులగొట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి అడిగారు శర్వానంద్ ని. మంచి సినిమాలు చేసే మీరు అలాంటి సినిమా ఎందుకు చేశారు, చేసినందుకు ఏమైనా ఫీలవుతున్నారా అని అడిగారు. దానికి విచిత్రమైన సమాధానం చెప్పాడు శర్వా. 

ఇంతకీ ఏమన్నాడో తెలుసా? ఆ సినిమా చేసినందుకు అస్సలు ఫీల్ కావడం లేదట. పైగా ఆ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడట. అందుకే ఆ సినిమా ఫెయిలైనా పెద్దగా బాధ కలగలేదు. అది స్వీట్ ఫెయిల్యూరు అంటూ చెప్పుకొచ్చాడు. ఎంత కవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మరీ ఇంత దారుణమా చెప్పండి. అది ఘోరమైన సినిమా అని ప్రపంచం మొత్తం అంటే... దాని నుంచి ఏదో నేర్చేసుకున్నాను అని చెబితే హాస్యాస్పదంగా ఉండదూ! గమ్యం, జర్నీ, అందరి బంధువయా లాంటి సినిమాలు చేసిన మంచి నటుడు అనాల్సిన మాటేనా ఇది. ఇలాంటి అనవసరమైన స్టేట్మెంట్లిచ్చి కామెడీ అయిపోకు సీరియస్ స్టార్!

మరింత సమాచారం తెలుసుకోండి: