బిర్యానీ అంటే మనకు ఇష్టం కదా అని, మనకు నచ్చుద్ది కదా అని అందరికీ బిర్యానీ మంచిదని చెప్పకూడదు. తినమని ప్రోత్సహించాల్సిన అవసరమూ లేదు. ఈ విషయం కరీనాకు  అర్థం కావడం లేదేంటో. ఈవిడ గారికి నచ్చినవి అందరినీ చేయమన్నట్టు చెబుతోంది. చేయడంలో తప్పులేదని ప్రోత్సహిస్తోంది.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయిలో ఉండగా పెళ్లి చేసుకునే సాహసం ఏ హీరోయిన్ చేయదు. కానీ కరీనా డిఫరెంట్ కదా! అందుకే పెళ్లి పీటలు ఎక్కేసింది. ప్రియుడు సైఫ్ ని మొగుడ్ని చేసేసుకుంది. అయితే అంతకుముందు అతగాడితో సహజీవనం చేసింది మేడమ్. అందుకే అనుకుంటా... ఇటీవల ఏదో మాట్లాడుతూ, సహజీవనంలో తప్పేముంది అంది. అందరూ షాకింగ్ చూస్తే... అంత కంగారు పడాల్సని పని లేదు, పెళ్లికి ముందే కలసి జీవిస్తే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, దానివల్ల పెళ్లయ్యాక సమస్యలు రావు, నేనలా సహజీవనం చేయడం వల్లే నా భర్తతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

అంతేనా... కాపురానికి సంబంధించిన టిప్స్ కూడా చెప్పింది మిసెస్ ఖాన్. ప్రొఫెషన్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం రావాలట. ఆఫీసు విషయాలను ఇంటి దగ్గర చర్చించకూడదట. అలా ఉంటే ఏ సమస్యలూ రావు తెలుసా అంటోంది. కొన్ని తరాలుగా అందరూ వీటిని చెబుతూనే ఉన్నారు. కానీ ఈ విషయాన్ని తనే తెలుసుకున్నంత గొప్పగా చెబుతోంది సెక్సీ సుందరి. కొత్త కాపురం కదా... మురిసిపోతోందిలెండి!

మరింత సమాచారం తెలుసుకోండి: