మన ఫిలిం సెలెబ్రెటీలకు రకరకాల వర్గాల నుండి అలాగే రకరకాల ప్రాంతాల నుండి ఆఖరకు వివిధ రాజకీయ పార్టీల నుండి అభిమానులు ఉంటారు. అందుకనే వారు ప్రతి విషయం పై చాల తెలివిగా స్పందిస్తూ ఉంటారు. అద్దాల మెడ లాంటి వారి కెరియర్ పై చిన్న రాయి తగిలినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారికి తెలుసు, అందుకే వారి మనస్సులో మాట సామాన్యంగా బయట పెట్టరు.

 హీరోయిన్స్ ఈ విషయంలో మరీ జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రాజకీయ ఉద్యమాల పై మన సినిమా మాయలేడి సమంత అభిప్రాయం తీసుకుందామని ఒక మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి సమంతను ఈ మధ్య తెగ వెంటాడట. ఆ ప్రతినిధి నేటి రాజకీయ ఉద్యమాల పై జరుగుతున్న రగడ పై కామెంట్ చేయమని ఎన్ని సార్లు అడిగినా నవ్వుతూ తప్పించుకున్న సమంత లేటెస్ట్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ‘ప్రస్తుత రాజకీయ ఉద్యమాల పై చాలా మంది అడుగుతున్న ప్రశ్నలకు నాసమాధానం  నో కామెంట్’ అంటూ ముగించిందట.

 ఏ సెలెబ్రెటీకి అయినా తప్పించుకోవడానికి ఇంతకన్నా తెలివైన సమాధానం ఉండదు కదా. రాజకీయనాయకులే రెండుకాళ్ళ సిద్దాంతం ఫాలో అవుతున్నప్పుడు వారి ముందు సమంత ఎంత !

 

మరింత సమాచారం తెలుసుకోండి: