ఇద్దరు టాప్ హీరోలు కుస్తీ పడితే ఎలా, అందరిలో ఒకటే టెన్షన్ ఎవరు గెలుస్తారని, ఇదే సీన్ టాలీవుడ్ లో త్వరలోనే చూడబోతున్నాం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబుతో తూఫాన్ ప్లాఫ్ తో కసి మీదున్న రాంచరణ్ కుస్తీ పడబోతున్నాడట.

తెలంగాణ కోట్ క్యాబినెట్ ఆమోదంతో చిరంజీవి పరిస్తితి రాష్ట్ర రాజకీయాల్లో మరింత విపత్కర పరిస్థితుల్లో పడిందని రాంచరణ్ తో పాటు ‘ఎవడు’ నిర్మాత దిల్ రాజు కూడా బావిస్తున్నారట. అందుకే దసరా సెలవుల్లో విడుదల చేయాలను కున్న ఈ సినిమాను ఇంకా వాయిదా వేసి సంక్రాంతికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు అంటున్నారు.

అదే సమయానికి మహేష్ బాబు తెరమీదకు వస్తున్నాడు. తను ప్రాణం పెట్టి తీస్తున్న ‘వన్ – నేనొక్కడినే’ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకే రాంచరణ్ తన ‘ఎవడు’ తో మహేష్ ‘వన్’ సినిమాతో హిట్టు విషయంలో కుస్తీ పడబోతున్నాడన్న మాట. సరే ఎవరు గెలుస్తారు, ఇది నిజమవుతుందా.. అంటే సంక్రాంతి దాకా ఆగాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: