ఒక‌ప్పుడు సినీ అభిమానులు అంటే ఎన్నో మంచి ప‌నుల‌కు ఆరంభం ఇచ్చే వాళ్ళని చెబుతుంటారు. రాను రాను ఆ ప‌ద్దతి అడుగంటిపోయి, అస్సలు ప‌ద్దతే లేకుండా పోయింది. గ‌త కొద్ది కాలం క్రితం దూకుడు సాధించిన రికార్డుల విష‌యంలో మెగా ఫ్యాన్స్‌, ఘ‌ట్టమ‌నేని ఫ్యాన్స్ మధ్య ర‌చ్ఛ ర‌చ్ఛ జ‌రిగింది. దీనికి విజ‌య‌వాడ వేధిక‌గా మారింది. మెగా ఫ్యామిలిలో ఏ హీరో మూవీ అయిన బ్లాక్‌బ‌స్టర్ అయితే చాలు, విజ‌య‌వాడ‌లో ఓ పెద్ద ప్లెక్సీ రెడీ అవుతుంది. ఆ ప్లెక్సీను బ‌య‌ట‌కు రిలీజ్ చేశారంటే దానిపై ఏదోఒక హీరోల అభిమాల‌తో గొడ‌వ మొద‌లైన‌ట్టే. ఇప్పుటి వ‌ర‌కూ మ‌గ‌ధీరా రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేద‌ని మెగా అభిమానులు చెబుతుంటారు.

కాని ప్రిన్స్ మ‌హేష్‌బాబు అభిమానులు మాత్రం మ‌గ‌ధీర రికార్డును దూకుడు తిర‌గరాసింది అంటూ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతారు. ఈ విష‌యంపై అభిమానుల మ‌ధ్య ఎన్నో సార్లు గొడ‌వ‌లు జ‌రిగితే, ఆ పంచాయితీలు హీరోల వ‌ద్ద వ‌ర‌కూ వెళ్ళాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా రిలీజ్ అయిన అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన క‌లెక్షన్స్ రికార్డును పోస్టర్ రూపంలో విజ‌వాడ‌లో మెగా ఫ్యాన్స్ రిలీజ్ చేశారు. దీనిపై నంద‌మూరి అభిమానులు,ఘ‌ట్టమ‌నేని అభిమానుల‌లో ఎవ‌రి వ‌ద్ద నుండి కౌంట‌ర్ పోస్టర్ రిలీజ్ అవుతుందో వెయిట్ చేయాలంటున్నారు. ప‌వ‌న్ రికార్డ్స్‌తో ప్రిన్స్ అభిమానులు ఏకిభ‌విస్తారో లేదో అనేది ఇప్పుడు బెజ‌వాడ‌లో హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: