ఓ సినిమా మీద వందల మంది ఆధారపడి జీవిస్తుంటారు. అందుకే అంటారు... ఒక్క సినిమా ఎంతోమందికి భోజనం పెడుతుందని. అయితే అందరి సంగతీ ఏమో గానీ... అత్తారింటికి సినిమా పుణ్యమా అని కొందరి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అదృష్టం వాళ్ల వెంట పరుగులు తీస్తోంది. వారిలో ముఖ్యులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నదియా.

అత్తారింటికి హిట్టయ్యేసరికి త్రివిక్రమ్ కి డిమాండ్ పెరిగిపోయింది. జులాయికి ముందు వరకూ ఫ్లాపుల ప్రస్థానాన్ని కొనసాగించిన త్రివిక్రమ్, జులాయి హిట్ తో తేరుకున్నాడు. అత్తారింటికి దారేది హిట్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు. అతడితో సినిమాలు తీయడానికి బడా నిర్మాతలు కూడా రెడీ అయిపోతున్నారు. దాంతో మన డైరెక్టర్ గారు ఒక్కసారిగా రేటు పెంచేశారు. మొన్నటివరకూ ఎనిమిది కోట్లు తీసుకున్నవాడు, ఇప్పుడు పన్నెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అయితే నిర్మాతలు ఇవ్వడానికి వెనుకాడటం లేదులెండి. ఇక అతడి తర్వాత రేంజ్ పెరిగింది నదియాకి. ఆమె కూడా అందరికీ తెగ నచ్చేయడంతో, దర్శకులంతా ఆమె వెంట పడుతున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు నదియా. ముప్ఫై లక్షలు తీసుకునే నదియా యాభై లక్షలకు పెంచేసింది తన రేటు. 

ఒక్క సినిమా వీళ్ల రేంజ్ ని ఇలా మార్చిందంటే, వరుసగా మరి కొన్ని హిట్లు వస్తే ఇంకెంత డిమాండ్ చేస్తారో ఏమో మరి. కష్టపడేవారికి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఇంతింత తీసేసుకుంటుంటే, చిన్న నిర్మాతలు వీళ్లని ఎలా భరిస్తారు! ఏ ధైర్యంతో వీళ్లని సంప్రదిస్తారు!

మరింత సమాచారం తెలుసుకోండి: