మనకు ఇద్దరు వంశీలున్నారు ఇండస్ట్రీలో. ఒకరు అలనాటి దర్శకుడు వంశీ, మరొకరు కృష్ణవంశీ. ఇద్దరూ సక్సెస్ ఫుల్ దర్శకులే. ఎవరి టేస్టును బట్టి వాళ్లు సినిమాలు తీసి జనాన్ని అలరించినవారే. కాసులు కురిపించినవారే. కానీ కాలం గిర్రున తిరిగేసరికి అదృష్టం తిరగబడింది. ఇద్దరూ డల్ అయిపోయారు.
సితార, లేడీస్ టైలర్ లాంటి సినిమాలతో అప్పట్లో అదరగొట్టాడు వంశీ. ఆయన కెమెరా యాంగిల్స్, లొకేషన్స్ అంటే పడి చచ్చిపోయేవారు జనం. అలాంటి వంశీకి చాన్సులు లేకుండా పోయాయి. అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు, హిట్ కొట్టాడు. కానీ మళ్లీ విఫలమయ్యాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు... ఆమె మొన్నే వెళ్లిపోయింది అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ సినిమా పూర్తయ్యిపోవచ్చిందట. కానీ దాన్ని కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని వినికిడి. బయ్యర్లు లేక సినిమా రీళ్లు బాక్సుల్లో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఇదే పరిస్థితి కృష్ణవంశీకి కూడా వచ్చింది... పైసా సినిమాకి. ఎంతో ఖర్చుపెట్టి, కష్టపడి తీసిన ఆ సినిమాని కూడా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దాంతో అది మూలనపడింది. బెల్లంకొండ సురేశ్ ముందుకొచ్చి దాన్ని విడుదల చేస్తానని అన్నాడు కానీ, అయ్యేవరకూ నమ్మకమైతే లేదు. అంటే, ఇద్దరు వంశీలదీ ఒకే పరిస్థితి అన్నమాట!



మరింత సమాచారం తెలుసుకోండి: