‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ తో సూపర్ హిట్ డైరెక్టర్స్ లిస్టు లో చేరిపోయిన హరీష్ శంకర్ తన ట్విటర్ లో రకరకాల కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంటాడు. తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే హరీష్ కొన్ని సందర్భాలలో వివాదాలను విమర్శలను ఎదుర్కున్న సందర్భాలు ఉన్నాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ వ్యక్త పరిచిన అభిప్రాయాలూ దర్శకుడు శ్రీనువైట్లను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి అంటు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

 ఈ ఇంటర్వ్యు లో హరీష్ శంకర్ తన సినిమాల గురించి చెపుతూ కేవలం కామెడి కోసమే తన సినిమాలలో సన్నివేశాలను సృస్టించననీ హరీష్ చెపుతూ, తన సినిమాలలో కధలో మిళితమైటట్లుగా కామెడీ సన్నివేశాలు ఉంటాయి. కానీ కేవలం బ్రహ్మనందాన్ని దృష్టిలో పెట్టుకుని తన సినిమాలో కామెడి ట్రాక్ లు పెట్టననీ తన సినిమా హీరో కమెడియన్స్ చేసే కామెడీ సీన్స్ పై ఆధారపడడని అంటూ తాను బ్రహ్మనందాన్ని దృష్టిలో పెట్టుకుని కామెడీ ట్రాక్ రాయాలి అంటే చాలామంది దర్సకుల కన్నా విపరీతమైన నవ్వు వచ్చే కామెడీ సన్నివేశాలు సృస్టించగలననీ హరీష్ చెప్పారు.

దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్రమైన చర్చలకు తెరతీయడమే కాకుండా ఈ మాటలన్నీ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి అని అంటున్నారు. ఇదే ఇంటర్వ్యూలో హరీష్ మరొక అడుగు ముందుకువేసి తన రామయ్యా వస్తావయ్యా సినిమాలో ఎన్టీఆర్, రోహిణీ హట్టంగడి ల మధ్య తీసిన హాస్య సన్నివేశాలు కధతో కలిసి ఉంటాయకానీ, అదివేరే కామెడీ ట్రాక్ లా అనిపించిందనీ చెప్పాడు.ఇంతకీ హరీష్ శంకర్ ఇన్ని గొప్పలు చెపుతున్న జూనియర్ రోహిణీ హట్టంగడి ల మధ్య సన్నివేశాలు ‘రామయ్య’ సినిమాలో ఎంత నవ్విస్తాయో చూడాలి. ఇంతకీ హరీష్ శంకర్ కు శ్రీనువైట్ల పై అంత అభిమానం ఎందుకో !

 

మరింత సమాచారం తెలుసుకోండి: