పాపం పవన్ కల్యాణ్ బతుకు తుడుచుకుని పారేస్ పేపర్ లాంటిదైపోయిందా అంటూ టాక్ మొదలయింది. ఆయనను అందరు వాడుకుని వదిలేసేందుకే ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. కారణం ఆయనను టాలీవుడ్ లో వాడుకుంటున్న తీరు అలాగే ఉందంటున్నారు.

తమ పేరు వినపడాలన్నా, తమపై అందరి దృష్టి పడాలన్నా పవన్ పవనిజాన్ని వాడుకుంటున్నారట. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా వచ్చి చేరాడు అంటున్నారు. పవన్ రాజీకీయాల్లోకి రావాలని ట్వీట్లు, గుళ్లుగోపురాలు తిరగడం వంటివి తెలిసిందే కదా.

ఇక హీరోల విషయానికి వస్తే రాంచరణ్ తో పాటు మెగా హీరోలంతా తమ సినిమాల్లో, ఫంక్షన్లలో పవన్ ను వాడుకోవడం షరామామూలే. ఇక ఇతరుల విషయానికి వస్తే నితిన్ వాడుకుంటున్నంత పవన్ ను ఎవరు వాడుకోవడం లేదన్నది నిజం. కొరియర్ బాయ్, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే మొదలగునవి పవన్ ను వాడుకున్నవే.

ఇక తాజాగా చిన్న హీరోలు మనోజ్, నవదీప్, నిఖిల్ లు చేరారు, హీరోలే కాదు హీరోయిన్లు కూడా పవన్ ను వాడేసుకుంటున్నారు. కొత్తగా పవన్ కు చిన్న మరదలుగా నటించిన ప్రణిత ట్విట్టర్ లో పవన్ ను తెగా వాడుకుంటోంది, మరో హీరోయిన్ కీర్తి కర్బందా కూడా పవన్ ను వాడుకుంటున్న వారిలో ఉన్నారు. ఇలా పవన్ ను అందరు వాడుకోవడానికే ఉపయోగించుకుంటున్నారు, తప్ప నిజమైన ప్రేమ లేదేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ వర్గాలు, అంటే వాడుకుని పారేసే టిష్యూ పేపర్ లా తయారయింది పవన్ పరిస్థితి అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: