ప్రముఖ నటి రోజా సమస్య లలో పడింది . తన సోదరుడి పైన పోలీసుల కు కంప్లయింట్ ఇచ్చినట్లు గా వార్తలు వస్తున్నాయి . తన సోదరుడి నుండి తనకు  రక్షణ కల్పించాలంటూ ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట. తన సోదరుడు రాంప్రసాద్ రెడ్డితో పాటు మేనేజర్ ప్రసాద రాజుల పైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు అని తెలుస్తోంది.  

డబ్బుల కోసం తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆమె సోదరుడి పైన ఆరోపణలు చేశారు. ఆమె అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ భూమి విషయంలో రోజాకు, ఆయనకు వివాదం ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తన  అన్నయ్య ప్రవర్తన నచ్చకపోవడంతో రెండేళ్లుగా మాట్లాడడం లేదని  రోజా చెబుతోంది .

 తన అన్నయ్య, మేనేజర్ ప్రసాద రాజు ఆర్థిక ఇబ్బందుల్ల లో ఉన్నపుడు తాను కూడబెట్టుకొన్న మొత్తం సొమ్మును యిచ్చి  ఆదు కున్నానని అయినా ప్రస్తుతం టివిల్లో గేమ్ షోల్లో నటిస్తూ కొద్దిగా ఆర్థికంగా బాగుడటం తో మళ్ళి తన అన్న వల్ల తనకు సమస్యలు మొదలు అయ్యా యని రోజా  కన్నీటి పర్యంతం అవుతున్నారు.  అయితే ఈ కుటుంబ వ్యవహారం సద్దుమణిగిందని  ఫిలింనగర్  టాక్ ..
 

మరింత సమాచారం తెలుసుకోండి: