సుడిగాడు అల్లరి నరేష్ ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో తన చిన్న తనం రోజులను గుర్తుకు చేసుకున్నాడు. అల్లరి నరేష్ తండ్రి ఈవివి సత్యనారాయణ కు చిన్న తనం నుండి నరేష్ కన్నా తన అన్న రాజేష్ ను బాగా ప్రేమగా చుసుకునేవాడట. తను చిన్నతనంలో బక్కగా పొడుగుగా ఉండే వాడిననీ గుర్తుకు చేసుకుంటూ తను బ్రతిమాలగా బ్రతిమాలగా తనను తన తండ్రి సత్యనారాయణ తన అన్న రాజేష్ తో కలిపి 1994 లో ఈవివి దర్శకత్వం వహిస్తున్న ‘ఆయనకిద్దరు’ సినిమా షూటింగ్ కోసం ఇండోనేషియాకు వెళ్ళడానికి తన తండ్రితో కలిసి మొట్టమొదటిసారి ఇంటర్ నేషనల్ ఫ్లైట్ ఎక్కాననీ గుర్తుకు చేసుకున్నాడు.

ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినతరువాత ఎయిర్ హోస్టెస్ తన ట్రేలో కొన్ని టిన్స్ పట్టుకుని తిరగడం చూశానని ఆ టిన్స్ తనకు కావాలని తన తండ్రి దగ్గర గొడవ పెడితే కూల్ డ్రింక్స్ టిన్స్ ఇచ్చాడనీ అయితే ఎయిర్ హోస్టెస్ దగ్గర ఉన్న తిన్సే కావలాని తను పంతం పట్టడంతో తన తల్లి వద్దంటున్నా తన తండ్రి నవ్వుకుంటూ తనగోల భరించలేక రెండు టిన్స్ తీసుకు వచ్చి ఇచ్చిన తరువాత వాటిని తాగి ఈ డ్రింక్స్ ఏమిటి ఇంత చేదుగా ఉన్నాయని అని అన్నాడట మన అల్లరోడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: