అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద స్లో జ‌ర్నీ చేస్తున్నప్పటికి, వ‌రుస‌ మూవీల‌కు క‌మిట్‌మెంట్‌ను ఇచ్చుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్‌గా 'త‌డాఖా' మూవీ విజయంను అందుకున్న నాగ‌చైత‌న్య, ఎట్ ప్రెజెంట్‌ అక్కినేని ఫ్యామిలి ఫిల్మ్ 'మ‌నం' షూటింగ్‌లో బిజిబిజిగా ఉన్నాడు. ఈ మూవీ నాగచైత‌న్యకు బాగా క‌లిసి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు. 

ఇదిలా ఉంటే 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' మూవీతో స‌క్సెస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య్‌కుమార్ కొండ ద‌ర్శక‌త్వంలో, ఓ మూవీను చేయ‌టానికి నాగ‌చైత‌న్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎవ‌రిన‌ తీసుకోవాలి అన్నదానిపై ఓ నిర్ణయానికి వ‌చ్చారు. మాజీ మిస్ ఇండియా యూనివర్స్ సాధించిన మోడ‌ల్‌ 'పూజా హెగ్డేని'ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాలీవుడ్ స‌మాచారం.

 రోమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ కోసం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని, డైరెక్టర్ ఈ హీరోయిన్‌ను ఎంపిక చేసిన‌ట్టు చిత్ర యూనిట్ చెబుతుంది. పూజా హ‌గ్డేని ఓ త‌మిళ్ మూవీలో న‌టించింది. 2012లో వ‌చ్చిన  త‌మిళ్ మూవీ 'ముగ‌మూడి'లో హీరో జీవా స‌ర‌స‌న న‌టించింది. ఈమూవీను తెలుగులో 'మాస్క్' అనే పేరుతో డ‌బ్ చేశారు. మొత్తానికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు నాగ‌చైత‌న్య ఓ కొత్త హీరోయిన్‌ను పరిచ‌యం చేయ‌బోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: