చార్మీ ‘మంత్రా-2’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన ఒక బెడ్ రూమ్ సన్నివేశంలో పవన్ ఫోటో చార్మీ రూమ్ లో ఉన్న ఫోటో వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కధకు పవన్ ఫోటోకు సంబంధo తెలియకపోయిన అమాయకంగా చూస్తున్న చార్మీ వెనుక పవన్ ఫోటో కనిపించడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఫోటో కూడా పవన్ ‘అత్తారింటి దారేది’ కి సంబంధించింది.

చార్మీ పవన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే, అత్తారింటి సినిమా సూపర్ సక్సస్ తో పవన్ మాటలు పాటలే కాదు పవన్ ఫోటోలను కూడా పెట్టి తమ సినిమాలను సూపర్ సక్సస్ చేసుకోవడానికి ‘మంత్ర-2’ సినిమా కొత్త ఓరవడి సృష్టిస్తోంది అని అనుకోవాలి. ఏ ఒక్క సినిమా చేసినా హిట్ అందుకోలేకపోతున్న చార్మీ కి పవన్ అత్తారిల్లు ఫోటో వైబ్రేషన్స్ ఇచ్చి చార్మీ సుడి తిరుగుతుందేమో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: