ఎన్టీఆర్‌ హీరోగా దిల్ రాజ్ తెరకెక్కిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' సినిమాను ఈ రోజు సెన్సార్ కు పంపుతూ ఉంటే  ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ పూర్తైందని,యు/ఎ సర్టిఫికేట్ వచ్చినదనే వార్తలు మీడియాలో వినిపిస్తూ ఉండటంతో ఈ వార్తలు దిల్ రాజ్ ను ఖంగారు పెడుతున్నాయాట. అసలు సినిమా సెన్సార్ పూర్తి కాకుండా ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకు వస్తున్నాయి అంటూ దిల్ రాజ్ ఖంగారు పడటమే కాకుండా ఈ వార్తలు ఎలా పుట్టుకువచ్చాయి అన్న విషయం పై ద్రుష్టి పెట్టాడని వార్తలు వస్తున్నాయి.  

అయితే ఈ వార్తలు అన్నీ రూమర్లు అని చెపుతున్నాడు దిల్ రాజ్.  డబ్బింగ్ పూర్తి చేసుకున్న రామయ్య సినిమా ఈ రోజు  సెన్సార్ తరువాత  రిలీజ్ కు రెడీ అవుతుంది. సమైఖ్య ఉద్యమ సెగలు కోస్తా జిల్లాలలో రోజురోజుకూ పెరిగి పోతున్నా వాటిని లెక్క చేయకుండా కోస్తా జిల్లాల బయ్యర్స్ ను ఒప్పించి ఈ వారంలోనే ఒక రోజు అటుఇటుగా దసరా పండుగను టార్గెట్ చేస్తూ రామయ్య సినిమాను ఖచ్చితంగా విడుదల చేయాలనీ దిల్ రాజ్ పట్టుదల మీద ఉన్నట్లుగా చెపుతున్నారు. దసరా సెంటిమెంట్ ను ఆసరాగా  తీసుకుని దిల్ రాజ్ చేస్తున్న ధైర్యం ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: