జీవిత రాజ‌శేఖ‌ర్‌పై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్‌ వారెంట్ జారి అయింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేప‌టి క్రిత‌మే కోర్టు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ఫైనాన్షియ‌ర్‌కు సంబంధించిన మ‌నీ మేట‌ర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌రందామ రెడ్డి అనే ఫైనాన్షియ‌ర్‌కు ముప్పై ఆరుల‌క్షల రూపాయ‌ల చెక్‌ను ఇచ్చారు. ఆ చెక్ కాస్త బౌన్స్ కావ‌డంతో వ్వవ‌హారం ఇంత వ‌ర‌కూ వ‌చ్చింది.

చెక్ బౌన్స్ అయిన త‌రువాత  ప‌రందామ‌రెడ్డి దాన్ని కోర్టు వ‌ర‌కూ తీసుకువెళ్ళాడు. దీనికి సంబంధించిన విచార‌ణ కొర‌కు కోర్టుకు హాజ‌రు కావాల‌ని జీవితారాజ‌శేఖ‌ర్‌కి నాంప‌ల్లి కోర్టు నోటీసుల‌ను పంపింది. జీవితారాజ‌శేఖ‌ర్‌ రెండు సార్లు కోర్టుకు హాజ‌రుకాలేదు. కోర్టు నోటీసుల‌ను ప‌ట్టించుకోని జీవితారాజ‌శేఖ‌ర్‌ల‌కు ఇప్పుడు నాంప‌ల్లి కోర్టు నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్‌ను జారీచేసింది. ఈనెల 29లోపు జీవితరాజ‌శేఖ‌ర్‌ని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజ‌రుప‌ర‌చాల‌ని దీనికి సంబంధించిన ప‌నిని జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌ను అప్పగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: