మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ను ఓ టాప్ డైరెక్టర్ అవమాన పరిచాడు. ఈ మాటలు చెప్పింది స్వయానా మంచు విష్ణు యే.  ఓసారి విష్ణు  కృష్ణ వంశీ దగ్గరకు వెళ్ళి  ‘నాతో యాక్షన్ సినిమా చేస్తారా?' అని అడిగాడట.. ‘నీతో యాక్షనా? కామెడీ సినిమా చేస్తా' అని సెటైర్లు వేసాడట కృష్ణవంశీ. దీనికి కారణం ఆ రోజులలో బొద్దుగా ఉండే విష్ణు బాడీ అట. ఆతరువాత బాగా సన్నబడి, మూడు నెలల తర్వాత విష్ణు ఆయన ముందుకెళితే, గుర్తు పట్టలేకపోయాడట.

ఈవిధంగా తను సన్నబడటానికి కారణం కృష్ణ వంశీ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. అలాగే ఆపరేషన్ చేయించుకుని లావు తగ్గాను అన్న టాక్ ని ఖండిస్తూ ఆపరేషన్ చేయించుకుంటే ఎవరూ ఒళ్ళు తగ్గరనీ ఒక నెల పూర్తిగా డైటింగ్ చేస్తే ఒళ్ళు తగ్గిపోతుందనీ విష్ణు చెప్పాడు. అంతేకాదు విష్ణు ఒళ్ళు తగ్గిపోవడం చూసి మోహన్ బాబు కంట తడి పెట్టుకుని తన కెరియర్ తొలినాళ్ళలో డబ్బు లేక సరైనవి తినక సన్నగా ఉండే వాడినని కానీ అన్నీ ఉన్న నీకు ఈకర్మ ఏమిటి అని మోహన్ బాబు విష్ణును ప్రశ్నించేవాడనీ విష్ణు నిన్న ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి అనేక ఆ శక్తికర విషయాలు చెప్పాడు.

ఈ రోజు తన  ఫిజిక్ బాగుంటుందని చాలామంది అంటున్నారు అంటే దానికి కారణం దర్శకుడు కృష్ణవంశీ అంటూ,  ఇప్పుడు కృష్ణవంశీతో చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని అంటున్నాడు మన మంచు విష్ణు. తను నిర్మించీ హీరోగా నటించిన ‘దూసుకెళత’ సినిమా సమైఖ్యంద్ర ఉద్యమం వలన అక్టోబర్ 17 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విష్ణు తెలిపాడు. తన కెరియర్ లోనే అత్యంత భారీ స్థాయి ధియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ‘దేనికైనా రెడీ' కంటే ఎక్కువగా నవ్విస్తుంది అని అంటున్నాడు విష్ణు. ఎదిఎమైనా బొద్దుగా ఉండే విష్ణును సన్నటి విష్ణుగా మార్చిన క్రెడిట్ కృష్ణవంశీకి దక్కుతుంది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: