రాజ‌మౌళి ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి మూవీ గురించి ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఈ మూవీకు సంబంధించిన ప్రతి చిన్న విష‌యాన్ని కూడ రాజ‌మౌళీ ప‌బ్లిసిటిగా మార్చుకోవ‌డానికి తెగ ప్రయ‌త్నిస్తున్నాడు. ఎట్‌ప్రెజెంట్ బాహుబ‌లి షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటిలో జ‌రుగుతుంది. ఈ సెట్‌ను స్వయంగా చూసిన రామోజీరావు, రాజ‌మౌళిను అప్రిషియోట్ చేస్తూ ఓ లెట‌ర్ రాశాడు.

రామోజీరావు రాసిన లెటెర్ నాకు వెయ్యి అవార్డుల‌తో స‌మానం అంటూ బాహుబ‌లి మూవీకు మ‌రికొంత ప్రమోష‌న్ చేసుకున్నాడు. ఇప్పుడు బాహుబ‌లి మూవీకు సంబంధించిన‌ మ‌రో విష‌యాన్ని వివ‌రిస్తూ ట్వీట్ చేశాడు. 'నా ఫిల్మ్ కెరీర్‌లోనే నేను ఇప్పటి వ‌ర‌కూ అనుకున్న టైంకు, అనుకున్న స‌మ‌యంలోనే షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేయ‌లేదు. కాని ఈ రోజు దాన్ని సాధించాను. బాహుబ‌లి అయిదు రోజుల షెడ్యూల్‌ను మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. ఇది నా కెరీర్‌లోనే మొద‌టి సారి' అంటూ ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: