చేసేది గోరంతయినా ఉంటుందో లేదో కానీ చెప్పేది మాత్రం కొండంత ఉంటుంది కొందరికి. పాపం కష్టపడి పని చేస్తారు. కానీ ఫలితం కనిపించాలి తప్ప వీళ్లు చెప్పుకోకూడదు కదా! ఆ విషయం తెలీక ఊరికే గొప్పాలు కొడుతుంటారు. రమ్యశ్రీ అదే పని చేస్తోంది. 

టీవీ సీరియళ్లు చేసి, సినిమాల్లో హాట్ వేషాలు వేసిన ఈ సెక్సీ లేడీ... ఎంతో కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమా ఓ మల్లి. తన మనసులో ఉన్న ఎన్నో భావాలను తెరకెక్కించానంటూ చెప్పి చెప్పి చంపేస్తోంది రమ్య. ఈ సినిమాకి అన్నీ స్పెషల్సే అట. ఈవిడగారు నటించడం మొదటి ప్రత్యేకతగా ఎలాగూ ప్రకటించేసుకుందనుకోండి. ఇక ఆ తర్వాత చాంతాడంత లిస్టు ఉంది. ఇందులో జేసుదాస్ పాటలు పాడారట. సేన్సార్ వాళ్లు సినిమా సూపర్ అని అన్నారట. ఇప్పటికే పలువురు సినిమాని ప్రశంసించేశారట. కొందరైతే ఆస్కార్ బరిలో పోటీ పడటం ఖాయం అని చెప్పారట. ఇక నా సినిమాకి తిరుగు లేదు అంటూ తెగ మెలికలు తిరుగుతోంది. 

ఇన్ని ప్రత్యేకతలు ఉండి, ఆస్కార్ కి కూడా వెళ్లిపోయే ఆ గొప్ప సినిమా ఇంకా ఎందుకు రిలీజ్ కావడం లేదు అని అడగండి... కిక్కురుమనదు. ఎందుకంటే, దాన్ని కొనడానికి ఏ నాథుడూ ముందుకు రాలేదు మరి. అందుకే ఇంకా డబ్బాలు రమ్య ఇంట్లోనే ఉన్నాయి. అయినా కూడా ఈవిడలా డబ్బా కొడుతుంటే ఏమనాలి! ఇంకో సంగతి తెలుసా... ఈవిడ గారు త్వరలో ఒక సినిమాలో హీరోయిన్ గా చేయబోతోందట. చూశారా... రమ్యకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్సో!

మరింత సమాచారం తెలుసుకోండి: