అవమానాలు ఎదురైతే కొందరు కుంగిపోతారు. తలచుకుని తలచుకుని కుమిలిపోతారు. కానీ విష్ణు అలా చేయలేదు. పంతం పెంచుకున్నాడు. పట్టుదలతో వ్యవహరించి తన అవమానాన్ని తుడిచేసుకున్నాడు. ఇంతకీ ఈ మంచు వారబ్బాయిని ఎవరు అవమానించారు!

కొన్నాళ్ల క్రితం ఓ రోజు మంచు విష్ణు దర్శకుడు కృష్ణవంశీని కలిశాడట. నాతో ఓ మాంచి యాక్షన్ సినిమా తీస్తారా అని అడిగాడట. దానికి కృష్ణవంశీ... లేదు, నీతో మాంచి కామెడీ సినిమా తీస్తాను అన్నాడట. దాంతో విష్ణు మనసు గాయపడిందట. కేవలం తన రూపాన్ని చూసి ఆయన అలా మాట్లాడటం తట్టుకోలేక, ఎలాగైనా మాంచి ఫిజిక్ ను తెచ్చుకోవాలని పంతం పట్టాడు. తెగ వర్కవుట్లు చేసి సిక్స్ ప్యాక్ బాడీని సంపాదించాడు. ఇప్పుడు తనను చూసి తానే మురిసిపోతున్నాడు. ఈ విషయాలన్నీ ఎవరో కల్పించినవి కాదు. స్వయంగా విష్ణు చెప్పినవి.
అయినా అన్ని సినిమాలు తీసి, క్రియేటివ్ డైరెక్టర్ అంటూ కొనియాడబట్ట కృష్ణవంశీ చేసిన పనేమైనా బాగుందా! ఓ మనిషిలోని లోపాన్ని ఎత్తి చూపి ఎగతాళి చేయకూడదన్న కనీస జ్ఞానం కూడా లేకపోతే ఎలా! పాపం నిజంగానే చాలా హర్ట్ అయి ఉంటాడు విష్ణు. అందుకే ఇంత కష్టపడ్డాడు. పోనీలే... మొదట బాధపడినా చివరికి ఆనందమే మిగిలింది!

మరింత సమాచారం తెలుసుకోండి: