సమైఖ్య ఉద్యమానికి ఎదురీది సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రప్రంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృస్టించిన ‘అత్తారిల్లు’ హీరో పవన్ తన లేటెస్ట్ సినిమా ‘గబ్బర్ సింగ్-2’ కు మెరుగు దిద్దే పనిలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కోసం షోలే నిర్మాతలతో పవన్ బేరసారాలు ఆడుతున్నాడు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. అయితే లేటెస్ట్ గా పవన్ మనస్సులో ఒక లేటెస్ట్ ఆలోచన వచ్చిందట.

ఈ సినిమా సీక్వెల్ టైటిల్ ను ‘గబ్బర్ సింగ్-2’ గా కాకుండా ‘గబ్బర్’ గా మారిస్తే ఎలా ఉంటుంది, అనీ తనకు వచ్చిన ఆలోచనను తన ప్రియమిత్రుడు త్రివిక్రంతోను అలాగే ఈ సినిమా దర్శకుడు సంపత్ నందితోను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం గబ్బర్ సింగ్ టైటిల్ విషయంలో షోలే నిర్మాతలతోటి జరిపిన చర్చలకు సరైన ప్రతిస్పందన రాకపోవడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం గోవాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంభందించి కొన్ని పంచ్ డైలాగ్స్ విషయంలో తన ప్రియనేస్తం త్రివిక్రమ్ సలహాలను కూడా తీసుకుంటున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా ఈ సినిమాలో తనకు జోడీ గా నటించడానికి బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, శ్రద్దా కపూర్ లలో ఎవరైనా ఒకరిని ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం పై కూడా పవన్ దృష్టి పెట్టేడు అనే టాక్. ఏది ఎలా ఉన్న ఈసినిమాషూటింగ్ ను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని పట్టుదల మీద ఉన్నాడట మన పవర్ స్టార్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: