దీపికా ప‌దుకొనె న‌టిస్తున్న ఆప్ క‌మింగ్ క్రేజీ ఫిల్మ్స్‌లో కొచ్ఛాడియ‌న్ కూడ ఒక‌టి. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న కొచ్ఛాడియ‌న్ మూవీలో దిపికా ప‌దుకొనె న‌టిస్తుంది. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం రావాలే కాని, ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ప్రత్యేకంగా మ‌న సౌత్ హీరోయిన్స్ అయితే అదో గ్రేట్ ఎచ్ఛీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతారు.

కాని దీపికా మాత్రం లైట్ తీసుకుంది. ఏవ‌రైతే నాకేంటి, పెద్ద స్టార్లు అయితే గౌర‌విస్తాను కాని, నా రెమ్యునరేష‌న్‌ను, నా రేంజ్‌న తగ్గించుకోలేము క‌దా అని స‌మ‌ధానం ఇచ్చింది. మొత్తానికి కొచ్ఛాడియ‌న్ మూవీలో దీపికాను తీసుకున్నంద‌కు, ప్రొడ్యూజ‌ర్ వ‌ద్ద నుండి మూడు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంది. దీపికా అంత రెమ్యురేష‌న్ తీసుకునే స‌రికి, సౌత్ ఇండ‌స్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడ అవాక్కయింది. 

ఇంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నా, దీపికా ఈ మూవీ కోసం ఎంత‌సేపు టైంను కేటాయించిందో తెలుసా ? కేవ‌లం 48 గంట‌లే ! ఇప్పుడు కొచ్చాడియ‌న్ మూవీకు డ‌బ్బింగ్ జ‌రుగుతుంది. దీపికా ప‌దుకొనె పాత్రకు త‌న చేతనే డ‌బ్బింగ్ చెప్పించాల‌ని అనుకున్న నిర్మాత‌, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీపికా ప‌దుకొనె కొచ్ఛాడియ‌న్ మూవీకు డ‌బ్బింగ్ చెప్పేందుకు ఇంట్రెస్ట్‌గా ఉన్నా, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ మాత్రం ఈ అమ్మడు రెమ్యున‌రేష‌న్ ఎంత అడుగుతుందో అని వ‌ద్దులే అని చెప్పేసింది. వెంట‌నే దీపికా పాత్ర కోసం ఫేమ‌స్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ స‌విత రెడ్డిను సెల‌క్ట్ చేసుకున్నారు. స‌విత రెడ్డి ఎంతో మంది హీరోయిన్స్‌కు డ‌బ్బింగ్ చెప్పింది. అందులో జెనీలియ దేశ్‌ముఖ్‌, ఐశ్వర్యారాయ్‌లు కూడ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: