మిల్కీ బ్యూటీ తమన్నా కు మరో గట్టి షాక్ తగిలింది . అయితే ఈసారి ఈ  షాక్  దర్శకుడు  వినాయక్ నుంచి తగిలింది .ఎప్పటి నుంచో అనుకుంటున్న  బెల్లం కొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్  సినిమాకు సబంధించి ఫ్లాష్ న్యూస్  చెప్పాడు వినాయక్. అంతే కాదు ఈ సినిమా  చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్రారంభం అనికూడా   వినాయక్ చెపుతున్నాడు .ఇందులో  హీరోయిన్‌గా సమంత నటిస్తోందని అంటూ , మొదట వేరే స్క్రిప్టు అనుకున్నా మనీ  అందులో సమంత, తమన్నా హీరోయిన్లుగా  అనుకుంటే   స్క్రిప్ట్ మారడం తో  ఇందులో ఒకే హీరోయిన్ ఉంటుంది అందువల్ల  తమన్నా లేదు అని ప్రకటించారు . అంతే కాదు ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా చెప్పారు  తేల్చి చెప్పారు వి వి వినాయిక్.

 అదే విధం గా ఈ  చిత్రం గురించి వివి వినాయిక్ మాట్లాడుతూ,'నాయక్' తర్వాత బెల్లంకొండ సురేశ్ వాళ్లబ్బాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేద్దామని నిర్ణయించుకున్నాను అని అంటూ , ‘స్క్రిప్టు తయారుచేశాం కానీ అది పూర్తి సంతృప్తినివ్వలేదు, మరింత మంచి స్క్రిప్టుతో శ్రీనివాస్‌ను పరిచయం చెయ్యాలని సురేశ్ కూడా అన్నారు, అందువల్లే ఆ సినిమాని లాంఛనంగా ప్రారంభించాక సెట్స్ మీద వెళ్లడానికి ఇంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు అందరికీ నచ్చిన స్క్రిప్టు పక్కాగా సిద్ధమైంది’ అన్నారు.  

 పవన్‌ ‘అత్తారింటికి దారేది' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాక సమంత రేంజిమరింత పెరిగింది  మరో  రెండు ఏళ్ళు  ఈమె డైరీ ఫుల్‌ అని అంటున్నారు .ప్రస్తుతం టాలీవుడ్ లో డైమెండ్ హీరోయిన్ గా కాసులు కురిపిస్తున్న సమంత అదృష్టం బెల్లం కొండ తనయుడు శ్రీనివాస్ కు ఎలా కలిసి వస్తుందో చూడాలి . ఏది ఏమైనా దర్శకుడు వినాయక్ ద్వారా   తమన్నా కు గట్టి షాక్ తగిలింది అనుకోవాలి

 

మరింత సమాచారం తెలుసుకోండి: