పవన్ ‘అత్తారిల్లు’  సినిమా పైరసీ వ్యవహారం చాలా మంది టాలీవుడ్ ప్రముఖులకు పాఠంగా మారింది. ముఖ్యంగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ సినిమా నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తోంది అని అంటున్నారు.  ప్రస్తుతం రాజమౌళి  ఎంతో ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న 'బాహుబలికి' సంబంధించి ఏ ఒక్క సీన్ కూడా  లీకేజ్‌ లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు  మన జక్కన్న తీసుకుంటున్నారని అంటున్నారు .   దీనికోసం  రాజమౌళి కొత్త  పద్దతులు   ప్రవేశ పెట్టారు అని టాక్. స్వతహాగా రాజమౌళి చాలా జాగ్రత్త పరుడు అని అంటారు. కానీ  ఇంత జాగ్రత్తలు  తీసుకున్నా అప్పట్లో  'మగధీర' చిత్రీకరణ సమయంలో  కొన్ని సన్నివేశాలు  అప్పట్లో లీక్‌ అయిన విషయం తెలిసిందే.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూనిట్‌ మొత్తానికి స్ట్రిక్ట్‌ రూల్స్‌ మన జక్కన్న  ఆదేశించాడని  టాక్. దీనితో  ముఖ్యంగా 'బాహుబలి'కి సంబంధించి ఎడిట్‌ షూట్  పాస్‌వార్డ్‌   తన కుమారుడుకు మాత్రమే తెలిసేలా చేశాడట.  అంటే  అతను  వచ్చి సిస్టమ్స్‌ ఆన్‌ చేయగలిగితేనే టెక్నిషియన్స్‌ పని చేయగలిగేది లేకుంటే లేదు. అలాగే షూటింగ్ సమయంలో సెల్ ఫోన్స్ ఎవరూ తీసుకోవటానకి వీల్లేదని ఆర్డర్స్ జారీ చేసాడట. దీనితో షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులు  అందరూ  మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారట . 100  కోట్ల సినిమా కాబట్టి ఆ మాత్రం హడావిడి ఉండాలి. ఏది ఏమైనా పవన్ అత్తా రిల్లు రాజమౌళి కి చాలా పాఠాలు నేర్పింది అనుకోవాలి ...

 

మరింత సమాచారం తెలుసుకోండి: