గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ పై నాగార్జున సినిమాలు బాగా తీసేవాడు. కానీ చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పుల నేపధ్యంలో నాగ్ తన సొంత సినిమాలు తీయడం తగ్గించు కున్నాడు. చివరకు తన పెద్ద కుమారుడు నాగచైతన్య కెరియర్ కు సంబంధించి బయట సినిమాలే చేయిస్తూ వచ్చాడు. అయితే హాటత్ గా నాగ్ తన నిర్ణయం మార్చుకుని మళ్ళీ వరుస పెట్టి తన సొంత సినిమాలు తీయడం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ నాగార్జున సొంత సినిమాల నిర్మాణం వెనుక ఒక ఆశక్తికర కధనం వినిపిస్తోంది. నాగార్జున క్రితం సంవత్సరం నటించిన ‘డమరుకం’ ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్నప్పుడు నాగ్ ఆ సినిమా నిర్మాతకు తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చివేయడమే కాకుండా ఇంకా అనేక విధాల సహాయం చేయవలసి వచ్చింది అన్న విషయం తెలిసిందే.

అదేవిధంగా ప్రస్తుతం నాగ్ చైతూ నటించిన ‘అటోనగర్ సూర్య’ బాధ్యతను కూడా తలకేత్తుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్ని విధాలుగా సహాయం చేసిన ఆ సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ఎవరికో డబ్బు ఇచ్చి నష్టపోవడం కంటే తానే జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ సినిమాలు నిర్మిచడం మంచిది అన్న ఆలోచనతో ఒకేసారి రెండు భారీ చిత్రాలు ‘భాయ్’, ‘మనం’ సినిమాలను నిర్మిస్తున్నాడనే వార్తలు వినబడుతున్నాయి.

ఈ సినిమాలకు అప్పుడే ప్రీ రిలీజ్ పోజిటీవ్ టాక్ రావడంతో సినిమాలు ఇంకా విడుదల కాకుండానే ‘గుండెజారి గల్లంతయ్యిoదే’ దర్శకుడు విజయ్ కుమార్ తో మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు అనే వార్తలను వింటున్న ఫిలింనగర్ వర్గాలు నాగ్ దగ్గర ఇంత డబ్బు ఉందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో వ్యాపారం చేయడం బాగా తెలిసిన నాగార్జున ఆలోచనలను పసి కట్టడం అంత సులువైన పనికాదు అనీ, ఆ సెటైర్లు వేస్తున్న వారికి తెలియదు కాబోలు…

మరింత సమాచారం తెలుసుకోండి: