ఈ మ‌ధ్య కాలంలో ఫిల్మ్ డైరెక్టర్లపై వ‌రుస‌గా ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా రాంగోపాల్‌వ‌ర్మ ఇంటిపై ఐటి దాడులు జ‌రిగాయ్‌. ఆ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో, అక్కడిక్కడే సెటిల్‌మెంట్ జ‌రిగికిగిపోయింది. వ‌ర్మ దానికి సంబంధించిన వ్వవ‌హారాన్ని చ‌క్కపెట్టుకున్నాడు. ఇప్పుడు మ‌రో ద‌ర్శకుడి ఇంటిపై ఐ.టి దాడులు జ‌రిగాయ్‌.

కోళీవుడ్ ప్రముఖ ద‌ర్శకుడు లింగుస్వామి ఇంటిపై ఐటి దాడులు జ‌రిగాయి. లింగుస్వామితో పాటు మ‌రికొంత మంది ప్రాడ్యూజ‌ర్ల పైనా ఐటి దాడులు జ‌రుగుతాయి అంటూ గ‌త కొన్ని రోజులుగా కోళీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఆ విష‌యాన్ని లైట్ తీసుకున్న లింగుస్వామికు ఇప్పుడు అనుకోని రీతిలో, త‌న‌పై ఐటి దాడులు జ‌రిగాయి. ఈ మ‌ధ్య కాలంలో లింగుస్వామి టాక్స్‌ల విష‌యంలో నిర్ణక్ష్యంగా ఉన్నాడంట‌. అందుకే ఈ విధ‌మైన ధాడి జ‌రిగిందంటూ మీడియాలో వినిపిస్తున్నటాక్‌.

కొంత మంది మాత్రం ఈ త‌రహా దాడులు ఇక్కడ చాలా క్యాజువ‌ల్‌, పెద్ద సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై లింగుస్వామి స‌క్సెస్ మూవీల‌నే తెర‌కెక్కించాడు. అలాగే ఎన్నో స‌క్సెస్‌ఫుల్ మూవీల‌ను కూడ చిత్రసీమ‌కు లింగుస్వామి అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: