టాలీవుడ్ నటుడు శ్రీహరి బుధవారం హఠాన్మరణం చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో మరణించారు. ప్రముఖ సినీ డ్యాన్సర్ డిస్కో శాంతి భర్త. ఇటీవల మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటన ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆయన వయస్సు 49. శ్రీహరి మరణవార్తతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది. గత కొద్దికాలంగా ఆయన కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 97 సినిమాల్లో నటించారు.

సినీ నటుడు శ్రీహరి మృతికి టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ గొప్పనటుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని, మానవతా వాది అని కొనియాడారు.

కేంద్ర మంత్రి చిరంజీవి:
నటుడు శ్రీహరి మరణ వార్త టాలీవుడ్ లో విషాదఛాయలను నింపింది. -అంతేకాకుండా మా కుటుంబానికి శ్రీహరి చాలా ఆప్తుడు. శ్రీహరి మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నాను

సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ:
శ్రీహరి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన గొప్ప మానవతావాదని, సినీ పరిశ్రమ ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ గేయ రచయిత చంద్రబోస్ :
శ్రీహరి గొప్ప నటుడని ఆయన హీరోగా, తాను సినీ గేయ రచయితగా తాజ్ మహల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశామని చెప్పారు.

సినీ గేయరయిత సుద్దాల అశోక్ తేజ :
శ్రీహరి మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన నటించిన చాలా సినిమాల్లో పాటలు రాశానని తెలిపారు. నిర్మాత నట్టి కుమార్.. రియల్ హీరో శ్రీహరి కుటుంబం సభ్యునిగా కలిసిమెలిసి ఉండేవారని వెల్లడించారు. ఆయన మరణం ఊహించని పరిణామమని అన్నారు.

కోట శ్రీనివాస్ రావు:
శ్రీహరి మరణించడం చాలా బాధాకమని అన్నారు. యావత్తు ప్రపంచం మంచి వ్యక్తిని కోల్పోయిందని తెలిపారు. సంగీత దర్శకులు చక్రి... శ్రీహరి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే మహా గొప్పవ్యక్తని కొనియాడారు. ఆయన ఎంతో ఆప్యాయతగా పలకరించేవారని తెలిపారు.

డైరెక్టర్‌ విజయ:
శ్రీహరి చిరంజీవి, నాగార్జున లాంటి అగ్రహీరోలకు శరీర ధారుడ్యం గురించి వివరిచించారని తెలిపారు. ఆయన తనను కలత చెందించిందని చెప్పారు.

సినీ నటుడు మాదాల రవి:
శ్రీహరి గొప్పనటుడని, కష్టపడి పైకొచ్చాడని అన్నారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.

శ్రీనువైట్ల:
శ్రీహరి మరణిండంతో ఓ మంచి స్నేహితున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో తనను ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయన మరణించడం చాలా బాధాకరమని అన్నారు.

ఏవీఎస్ :
శ్రీహరి మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మృదుస్వభావి అని కొనియాడారు. నిర్మాత బండ్ల గణేష్... శ్రీహరి తనతో ఓ సోదరుని గా ఉండేవారని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని, తనకు ఆయనతో కలిసి నటించిన అనుభవం ఉందని పేర్కొన్నారు.

రెంటాల జయదేవ్:
శ్రీహరి మరణ వార్త టాలీవుడ్ ను దిగ్భాంతి కలిగించిందని అన్నారు. శ్రీహరి సినీ పరిశ్రమలో తనకు తానుగా పైకి వచ్చాడని చెప్పారు. శ్రీహరి కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధంలేకున్నా కష్టపడి పైకి వచ్చారని అన్నారు.

డైరెక‌ర్టర్‌ సాగర్ :
టాలీవుడ్ లో శ్రీహరి గొప్ప మనిషి అని అన్నారు. ఇండస్ట్రీలో అందరితో స్నేహభావంతో మెలిగేవాడని అన్నారు. సినిమా పరిశ్రమలో కింది స్ధాయిలో పనిచేసేవారిని ప్రోత్సహించేవాడని తెలిపారు.

నిర్మాత, కాట్రగడ్డ మురారి :
శ్రీహరి మరణం తనకు బాధ కలిగించిందని అన్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో శ్రీహరి ప్రదర్శించిన నటన అద్భుతమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: