వ‌రుస హిట్లతో స‌మంత‌ జెట్ స్పీడ్‌లో దూసుకు వెళుతుంది. దీంతో స‌మంత కాల్షీట్లకు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. ఏ మూవీ చేసినా హిట్టే, ప్రతి హీరోకూ స‌మంత ల‌క్కీ హీరోయిన్నే. ప్రొడ్యూజ‌ర్లకు అయితే స‌మంత దేవుడు ఇచ్చిన వ‌రం. ఎట్‌ప్రెజెంట్‌ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌మంత‌పై అంద‌రూ ఈ విధంగానే అనుకుంటున్నారు. 'త‌క్కువ ఖ‌ర్చు ప్రాఫిట్ ఎక్కువ‌' అని స‌మంత‌కు టాగ్ లైన్ కూడ ఇచ్చేస్తున్నారు.
ఇక నుండి టాగ్‌లైన్‌ని మారుస్తానని స‌మంత అంటుంది. 'ఖ‌ర్చూ ఎక్కువే, క్వాలిటీ ఎక్కువే' అని బోర్డు తిప్పేసింది. ఇండ‌స్ట్రీలోని క్రేజీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూజ‌ర్స్‌కి మాత్రం ఈ రేట్ ట్యాగ్‌లో కొద్దిగా మార్పులు ఉంటాయ‌ని చెప్పుకుంటుంది. అత్తారింటికిదారేది స‌క్సెస్ త‌రువాత నుండి స‌మంత రెమ్యున‌రేష‌న్స్‌లో చాలా మార్పులు జ‌రిగాయ‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంటుంది.
మూవీల రెమ్యున‌రేష‌న్‌ను ప‌క్కన పెడితే, ఏదైన షాపింగ్ మాల్స్‌కు రిబ్బన్ క‌టింగ్ చేయాలంటే స‌మంత‌కు అర‌కోటికు పైగానే స‌మ‌ర్పించుకోవాలంట‌. కేవ‌లం గంట సేపు వ‌చ్చి సంద‌డి చేసినందుకు ఇంత ఖ‌ర్చు ఇవ్వాల అని అడిగితే, ఖ‌చ్చింత‌గా ఇవ్వాలి అని అంటుంది. 'కేవ‌లం డ‌బ్బును మాత్రమే తీసుకోను, దానికి సంబంధించి ప్రమోష‌న్‌ను కూడ నేను చూసుకుంటున్నాను. సోష‌ల్ నెట‌వ‌ర్కింగ్ సైట్స్‌లో ఆ ప్రొడ‌క్ట్ గురించి ఊధ‌ర‌గొడ‌తాను' అని త‌న స‌ర్వీసెస్ గురించి చెప్పుకుంటుంది. దీంతో స‌మంత కాల్షీట్స్ ఇంత కాష్ట్‌లీగా మారండంతో కొంత మంది వేరే ఆల్టర్‌నేట్‌ను ఎంచుకుంటున్నారు. మ‌రి కొంత మంది మాత్రం స‌మంత‌కు ఏంతైనా ఇవ్వటానికి సిద్ధప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: