రియల్ స్టార్ శ్రీహరి చనిపోయి రెండు రోజులు గడిచిపోయినా ఆ షాక్ నుండి ఇంకా టాలీవుడ్ కోలుకోలేదు. శ్రీహరి ఆకస్మిక మరణం గురించి నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ యదార్ధ కధనం ప్రసారం చేసింది. శ్రీహరికి లివర్ సిరోసిన్ అనే వ్యాది గత రెండు సంవత్సరాలుగా ఉందని డాక్టర్ మదాల రవి తెలిపారు. ఇటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకి వైద్యం చేసేడప్పుడు గత కేసు హిస్టరీ దృష్టిలో పెట్టుకుని వైద్యం చేయాలనీ, కానీ శ్రీహరికి ఉన్న అనారోగ్యం దృష్టిలో పెట్టుకోకుండా ముంబాయి లీలావతి హాస్పటల్ వాళ్ళు వైద్యం చేసి ఉంటారు అన్న అనుమానాన్ని డాక్టర్ మాదాల రవి వ్యక్త పరిచారు.

శ్రీహరి కి ఈ వ్యాది వచ్చింది అని తెలిసిన తరువాత అవుట్  డోర్ షూటింగ్స్ తగ్గించుకోమని తాను సలహా ఇచ్చాను అని కూడా మాదాల రవి చెప్పారు. ముంబాయి లో ‘రాంబో రాజ్ కుమార్’ సినిమా షూటింగ్ లో ఉన్న శ్రీహరికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఒక డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ శ్రీహరికి రియాక్షన్ రావడంతో  వెనువెంటనే లీలావతీ హాస్పటల్ కి తీసుకు వెళ్ళినా అక్కడ ఉన్న డాక్టర్లు వెంటనే వైద్యం అందించ కుండా రకరకాల వైద్య పరీక్షలతో సమయాన్ని వృధా చేసారు అని అన్నారు.

ఈ ఆలస్యం శ్రీహారి మరణానికి కారణంగా మారి ఉండవచ్చనీ డాక్టర్ మాదాల రవి అభిప్రాయ పడుతూ శ్రీహరికి ఉన్న అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా క్రోసిన్ టేబ్లేట్ ఇచ్చిన అది ప్రాణాంతకంగా మారుతుంది అంటూ శ్రీహరి మృతికి తన సంతాపాన్ని తెలియచేసారు. ఎవరి అశ్రద్ద అయినా కారణాలు ఏమైనా ఒక మంచినటుడు మరియు మంఛి వ్యక్తి మరణానికి కారణం అయింది అనుకోవాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: