రామ్‌చ‌ర‌ణ్‌, విక్టరీ వెంక‌టేష్ క‌లిసి న‌టించ‌బోతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం త్వర‌లోనే షూటింగ్‌కు రెడీ అవుతుంది. ఈ మూవీకు సంబంభిందిన స్క్రిప్ట్ ప‌నులు కూడ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. రీసెంట్‌గా ఈ మూవీలో కృష్ణ న‌టించడంలేద‌ని టాలీవుడ్ స‌మాచారం. అయితే రామ్‌చ‌ర‌ణ్‌,వెంక‌టేష్ మిన‌హా ఈ మూవీలో మిగ‌తా పాత్రల గురించి పూర్తి స‌మాచారం ఎవ్వరికీ తెలియ‌దు. కాస్టింగ్ సంబంధించిన చ‌ర్ఛలు ఇంకా కొన‌సాగుతున్నాయి.

ఓ ప‌క్క కృష్ణవంశీ స్క్రిప్ట్ ప‌నులను చ‌క‌చ‌కా పూర్తి చేసుకుంటుంటే, మ‌రో వైపు కాస్టింగ్‌కు సంబంధించిన డిస్కష‌న్స్ కూడ జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే మ‌ల్టీస్టార‌ర్ మూవీను ఏ ఏ లొకేష‌న్లలో చిత్రీక‌రించాలో, దానికి  సంబంధించిన లోకెష‌న్ల వేట‌ను ప్రారంభించారు. మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కు హైద‌రాబాద్‌లోని కొన్ని ప‌బ్లిక్ ప్రదేశాల‌లో షూటింగ్ చేయాలని, దానికి సంబంధించిన లోకేష‌న్ల విజువ‌ల్స్‌ను చిత్ర యూనిట్ ప‌రిశీలిస్తుంది. దీంతో త్వర‌లోనే ఈ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్‌ను త్వర‌లోనే వెల్లడించేందుకు నిర్మాత బండ్ల గ‌ణేష్ స‌న్మాహాలు చేస్తున్నట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: