సమైక్య ఉద్యమ సెగలను పైలిన్ తుఫాన్ గండాన్ని లెక్క చేయకుండా తనకు కలిసొచ్చే 11 నెంబరును అలాగే గతంలో తనకు విజయాలను ఇచ్చిన దసరా ను నమ్ముకుని ధైర్యంగా ‘రామయ్యా వస్తావయ్యా’ అంటూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన జూనియర్ సినిమా దిల్ రాజ్ సెంటిమెంట్ కు ఏ విధంగాను కలిసిరాలేదు అనే వార్తలు వస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఢిల్లీ లో తెలంగాణ ప్రక్రియ వేగవంతంగా జరిగిపోతున్నా జూనియర్ సినిమాను మహబూబు నగర్ జిల్లాలోని గద్వాల్  దగ్గర తెలంగాణా వాదులు అడ్డు కోవడం ఆశ్చర్య కరం.

 ఇక సమైఖ్య ఉద్యమ సెగలతో రగిలి పోతున్న సీమాంద్ర ప్రాంతం గురించి వేరే చెప్పనవసరం లేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం కోస్తా ప్రాంతాలలో కూడా ఈ సినిమాకు ఉహించినంత స్పందన రాలేదు. దర్శకుడు హరీష్ శంకర్ మేజిక్ ఈ సినిమాలో పనిచేయలేదు అని అంటున్నారు. ఈ సినిమా సెకండ్ ఆఫ్ మరీ బలహీనంగా ఉండి తరువాత సన్నివేశం ఏమి జరుగుతుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటున్నారు. అదేవిధంగా బ్రహ్మనందం కామెడీ ట్రాక్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారిందని అంటున్నారు.

ఎదిఎమైనా దిల్ రాజ్ సెంటిమెంట్లు ఏమీ రామయ్యా వస్తావయ్యాకు పనిచేయలేదు అనే అనుకోవాలి. ‘ఎవడు’ సినిమా విడుదల అగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత పరిస్థుతులలో రామయ్యకు ఈ ఎవరేజ్ టాక్ రావడంతో దిల్ రాజ్ షేక్ అవుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: