ఏ మూవీ అయినా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న త‌రువాత‌ అది పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఒక మూవీకు సంబంధించిన‌ పూర్తి అవుట్ పుట్ బ‌య‌ట‌కు రావ‌డంలో ఇదే కీల‌క పాత్ర వ‌హించే విభాగం. ఈ పోస్ట్ ప్రొడ‌క్షన్‌లోనే న‌టుల న‌టించిన పాత్రల‌కు జీవం పోసుకునేది. వారు వారి పాత్రల‌కు డ‌బ్బింగ్‌ను పోస్ట్ ప్రొడ‌క్షన్‌లోనే చెప్పుకుంటారు.

లీడ్ రోల్ చేస్తున్న పాత్రల‌కు, ఆ న‌టులు డ‌బ్బింగ్ చెప్పుకోవాలంటే క‌నీసం రెండు మూడు రోజుల స‌మ‌యం ప‌డుతుంది. కొంత మందికి అయితే అది వారం రోజుల వ‌ర‌కూ ప‌ట్టవ‌చ్చు. అయితే అమితాబ్ బ‌చ్ఛన్ మాత్రం త‌ను న‌టించిన ఓ మూవీకు కేవ‌లం అయిదు గంట‌ల్లోనే డ‌బ్బింగ్‌ను పూర్తిచేశాడు. దాన్ని చూసిన పోస్ట్‌ప్రొడ‌క్షన్ యూటిన్‌కు ఇది అంతుప‌ట్టని విష‌యంగా మారింది.

అమితాబ్ బ‌చ్ఛన్ న‌టించిన 'షూట్ అవుట్ ఎట్ లోకండ్‌వాల' మూవీలో ఈ విశేషం జ‌రిగింది. ఈ మూవీలో అమితాబ్‌కు సంబంధించిన 23 సీన్లు ఉన్నాయి. ఈ 23 సీన్లకు కేవ‌లం 5 గంట‌ల్లోనే డ‌బ్బింగ్‌ను పూర్తిచేశాడు. కొన్ని సార్లు అయితే ఫ‌స్ట్ టైంలోనే ఓకే అయిన డ‌బ్బింగ్ సీన్స్ ఉన్నాయి. ఈ రోజు అమితాబ్ త‌న 71వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా, త‌ను ఎటువంటి అద్భుతాల‌ను సృష్టించాడో, ప‌ని మీద ఎంత‌టి శ్రద్ధను చూసిస్తాడో అనేదానికి ఇది చిన్న ఉదాహ‌ర‌ణ మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: