అఫైర్లతో వార్తల్లోకి రావడం నయనతారకి కొత్తేమీ కాదు. ప్రేమ వ్యవహారాలకు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఎంత ఫేమసో, కోలీవుడ్లో నయనతార అంత ఫేమస్. మొదట శింబు, తర్వాత ప్రభుదేవా, ఇప్పుడు ఆర్య.

ఆర్య పేరు చెబితేనే కస్సుమంటుంది నయన్. ఇద్దరం కలసి ఓ సినిమాలో నటిస్తున్నాం, అందుకే కాస్త క్లోజ్ గా మూవ్ అవుతున్నాం, దీనికే సంబంధం అంటగట్టెయ్యాలా అంటూ విరుచుకుపడింది ఆ మధ్య. అసలు తనకు ఆర్యమీద అలాంటి ఉద్దేశమే లేదని అంది. తన మనసు సినిమాల మీద తప్ప మరి దేనిమీదా లేదని మొత్తుకుంది. దాంతో, ఒకవేళ మనమే అపార్థం చేసుకుంటున్నామా అని కొందరు పునరాలోచనలో కూడా పడ్డారు.

కానీ అంతా హుళక్కి. ఆమె చెప్పేవన్నీ కట్టు కథలే అని తేలిపోయింది. ఇటీవల జరిగిన రాజారాణి సక్సెస్ వేడుకలో ఈ ఇద్దరూ తెగ ఎంజాయ్ చేశారని సమాచారం. అందరూ కలసి సరదాగా గడిపినా, ఈ ఇద్దరూ మాత్రం ప్రత్యేకంగా స్పెండ్ చేశారట. ఒకరికొకరు కేకులు తినిపించుకుని, దొంగ చూపులు చూసుకుని మురిసిపోయారట. అయితే ఆ పార్టీ ముగిసిన తర్వాత, ఇద్దరూ వేరేచోటికి వెళ్లి కూడా టైమ్ గడిపారని కొందరు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఏమీ లేదు ఏమీ లేదు అనే నయన్, మరి దీనికేం సమాధానం చెబుతుంది! అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నా కూడా, మీ చూపు సరిగ్గా లేదు అని మనమీదే తప్పు తోసేస్తుందా!

మరింత సమాచారం తెలుసుకోండి: