సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. సినిమా తేదీలు మారాయి. డేట్లు అడ్జస్ట్ మెంట్లు అయ్యాయి. వీటితో పాటు వేడుకలు కూడా రద్దవుతున్నాయి. మసాలా సినిమా ఆడియో రిలీజును రద్దు చేస్తున్నట్టు ఆ చిత్ర వర్గం ప్రకటించింది.

వెంకటేష్, రామ్ కలసి నటించి మసాలా చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నెలలో ఆడియోను విడుదల చేయాలని కూడా డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడా వేడుక లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఆడియోను ఘనంగా విడుదల చేయాలని అనుకోవడం లేదని, డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తామని చెప్పారు యూనిట్. ఇది కొందరికి డిజప్పాయింటింగ్ గా ఉన్నా... కొందరికి మాత్రం మంచిదేననిపిస్తోంది.

దానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ఆడియో విడుదల పేరుతో వేడుకల కోసం బోలెడంత సొమ్ము ఖర్చు పెడుతున్నారు. చిన్న సినిమాల దగ్గర్నుంచి పెద్ద సినిమాల వరకూ పెళ్లిని మించిన ఆర్భాటం చేసి, ఊదరగొట్టేస్తున్నారు. కానీ చివరికి సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. అన్నీ అలానే జరుగుతున్నాయని కాదుగానీ, ఎక్కువశాతం అలానే జరుగుతున్నాయి. దాంతో కొందరికి చిరాకు పుడుతోంది. ఈ గొప్పలు పోయేదేదో సినిమాని అద్భుతంగా తీసి అప్పుడు చూపిస్తే బాగుటుందంని అంటున్నారు. వాళ్ల మాటలో తప్పేమీ లేదు. రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్టు... ఆడియో వేడుకలు, ప్రమోషన్ కార్యక్రమాల కంటే జనాలకు సినిమాయే ముఖ్యం. వీటి మీద శ్రద్ధ వాటిమీద పెట్టడం మంచిది!

మరింత సమాచారం తెలుసుకోండి: