ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన ఆ మూవీ, టాలీవుడ్‌లో బ్లాక్‌ బ‌స్టర్ ఖాయం అని అంద‌రూ అనుకున్నారు. కాని అంచ‌నాలు తారుమారై, మూవీ ఘోర డిజాస్టర్‌ను చ‌విచూసింది. ఆ రిజ‌ల్ట్‌ను టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో పాటు, యావ‌త్ ప్రిన్స్ అభిమానులు సైతం ఊహించ‌లేదు. అదే మాట‌ల మాంత్రికుడు,ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఖ‌లేజా మూవీ. ఇప్పుడు వీరిద్దరి కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ ప‌ట్టాలెక్కబోతుంది.

వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ అత‌డు మూవీ థియోట‌ర్లో యావ‌రేజ్ టాక్ తెచ్చుకొని, టెలివిజ‌న్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్టర్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. సెకండ్ ఫిల్మ్ ఖ‌లేజా మాత్రం నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్లకు తీర‌ని న‌ష్టాన్ని చేకూర్చింది. లేటెస్ట్‌గా త్రివిక్రమ్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు కాబ‌ట్టి, ప్రిన్స్ మ‌రోసారి త్రివిక్రమ్ స్టోరికు ఓకె చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డిటైల్స్ త్వర‌లోనే వెల్లడికానున్నాయి.

ఇదే జ‌రిగితే ప్రిన్స్,త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీ బ్లాక్ బ‌స్టరన్నా అవుతుంది, లేకుంటే డిజాస్టర్ అన్న ఆవుతుంది. త్రివిక్రమ్ మూవీలు ఒక్కోసారి అనుకోని రీతిలో ఫెయిల్యూర్స్‌ను చూస్తాయి. ప్రిన్స్‌కి ఆల్రెడీ ఒకసారి డిజాస్టర్ ఇచ్చాడు కాబ‌ట్టి, ఈ సారి ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్టర్ క‌థ‌ను ప్రిపేర్ చేసుకుంటాడ‌ని టాలీవుడ్‌తో పాటు, ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడ నమ్ముతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: